చిరంజీవిగా జగపతిబాబు

By Staff

Jagapati Babu
జగపతిబాబుని చిరంజీవి వంటి పెద్ద హీరోగా ప్రెజెంట్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సినిమా పేరు మా నాన్న చిరంజీవి. అంటే పేద్ద హీరో అనేది ట్యాగ్ లైన్. పవన్ కళ్యాణ్ కి తమ్ముడు వంటి సూపర్ హిట్ అందించిన అరుణ్‌ ప్రసాద్‌ ఈ చిత్రం దర్శకుడు. లాఫింగ్‌ లార్డ్‌ సంస్థ అనే నూతన నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీలిమ కథానాయిక. అతులిత్‌ ప్రధాన పాత్రధారి. సినిమా గురించి జగపతిబాబు మాట్లాడుతూ 70 శాతం పూర్తయింది. పూర్తిగా వినోదాన్ని పండించే చిత్రమిది. భావోద్వేగాలకు అవకాశమున్న సినిమా. అరుణ్‌ప్రసాద్‌తో పనిచేయడంలో సౌలభ్యం కనిపించింది. అతులిత్‌ది కూడా కీలకమైన పాత్ర. ఈ సినిమాలో నేను కొన్ని సన్నివేశాల్లో డిక్షనరీలు అమ్ముతుంటాను. నీలిమతో పనిచేస్తుంటే 'శుభలగ్నం'లో ఆమని గుర్తుకొచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. మంచి పాత్రలో చేస్తున్నట్టు నీలిమ పేర్కొన్నారు. సంగీతం: చక్రి, కెమెరా: భరణి.కె.ధరన్‌, కళ: కె.వి.రమణ, కూర్పు: బస్వా పైడిరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X