twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూఢచారి టీం నన్ను చీట్ చేసింది, ఆ వెధవలతో సంబంధం లేదు: జగపతి బాబు

    By Bojja Kumar
    |

    అడివి శేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో.. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా.. అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం గూఢ‌చారి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఆగ‌స్ట్ 3న విడుద‌ల చేసిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగపతి బాబు ఎమెషనల్‌గా ప్రసంగించారు.

    నేనొక ప్లాప్ స్టార్ అని తర్వాత తెలిసింది

    నేనొక ప్లాప్ స్టార్ అని తర్వాత తెలిసింది

    గూఢచారి సినిమాతో నాకు 30 సంవత్సరాలు పూర్తయింది. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుని వచ్చిన నేను ఇన్నేళ్లు ఉండటం సంతోషంగా ఉంది. నా తొలి సినిమాకు చిరంజీవిగారు క్లాప్ కొట్టారు, సినిమాల్లోకి వచ్చే ముందు ఒక స్టార్ పుట్టబోతున్నాడని ఫీలయ్యాను. ఆ తర్వత తెలిసింది ఒక ప్లాప్ స్టార్ అని.

    Recommended Video

    Sobhita Dhulipala Gives Reply To Mahesh Fans
     130 సినిమాల్లో చేశాను

    130 సినిమాల్లో చేశాను

    తొలి మూడు సంవత్సరాల్లో పది పన్నెండు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయినా 27 సంవత్సరాలు ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాననంటే అందరూ సపోర్ట్ చేయడం వల్లే. దాదాపు 130 సినిమాలు చేశాను. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేను కానీ వారికి థాంక్స్ మాత్రం చెప్పగలను.

    30 ఏళ్లలో ఇదే బెస్ట్

    30 ఏళ్లలో ఇదే బెస్ట్

    ఈ 30 సంవత్సరాల్లో ఈ సాయంత్రం నా కెరీర్లో బెస్ట్. నా మీద ఒట్టేసి చెబుతున్నాను. నాకు సోషలైజింగ్, మాట్లాడటం, యాక్టింగ్ ఏమీ రాదు. అటువంటిది ఈ రోజు ఈ ఫంక్షన్ నా కోసం చేశారు.

     నన్ను కూడా చీట్ చేశారు

    నన్ను కూడా చీట్ చేశారు

    సాధారణంగా సినిమాకు అందరూ కష్టపడతారు. కానీ వీళ్లు గొడ్డు చాకిరీ చేశారు. చాలా చిన్న టీం. ఈ సినిమా టీమ్ చాలా పెద్ద చీటర్స్... లొకేషన్స్ దగ్గర నుండి ప్రతిదీ చీటింగే. నన్ను కూడా చీట్ చేశారు, నాకు తెలియకుండా నా షాట్లు ఎన్నో ఉన్నాయి. అంటే దానికి కూడా తెలివి కావాలి. మంచి చీటింగ్ ఎప్పుడూ అప్రిషియేటింగే.

    వీరిపై నమ్మకం ఏర్పడింది

    వీరిపై నమ్మకం ఏర్పడింది

    శేష్‌ని, శ‌శిని న‌మ్మి నిర్మాత‌లు సినిమాపై డ‌బ్బు ఖ‌ర్చు పెట్టారు. నేను కూడా న‌మ్మే సినిమా చేశాను. సినిమా చూసిన త‌ర్వాత డ‌బ్బులు తీసుకోకుండా సినిమా చేసుంటే బావుండేద‌నిపించింది. వీళ్ల‌లో ఎవ‌రైనా నెక్స్‌ట్ సినిమా చేసేట‌ప్పుడు నాకు క‌థ చెప్ప‌న‌క్క‌ర్లేదు. డేట్స్ చెప్పండి చాలు వ‌చ్చి చేసేస్తాను.

    నాకు యాక్టింగ్ రాదు

    నాకు యాక్టింగ్ రాదు

    ఈ సినిమా తర్వాత నా రెస్పెక్ట్ మరింత పెరిగింది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ గొప్పగా తీయడమే. ఏ సినిమాకైనా డైరెక్టరే కెప్టెన్. నాకు అసలు యాక్టింగ్ రాదు. గాయంలో నేను యాక్టింగే చేయలేదు. ఆర్జీవి నా మొహం అలా చూపించాడు.

    ఆ సమయంలో నాకు లెజెండ్ వచ్చింది

    ఆ సమయంలో నాకు లెజెండ్ వచ్చింది

    మూడేళ్లు పని లేక నా కెరీర్ అయిపోయిందా అనుకునే సమయంలో ‘లెజెండ్' సినిమా వచ్చింది. నేను చేస్తానా? లేదా? అని వారు డౌట్ పడ్డారు. కానీ నేను వారి కోసం వెయిట్ చేశాను. రెమ్యూనరేషన్ గురించి కూడా చాలా ఆలోచించాను. నేను ఇంత చెబుదామనుకున్నాను. కానీ వారు చాలా ఎక్కువ చెప్పారు. కేవలం నా మీద రెస్పెక్టుతోనో మా నాన్నగారి మీద రెస్పెక్టుతో అలా చెప్పి ఉంటారు. అనిల్ గారు నా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన సమయంలో... ఇపుడు 30 సంవత్సరాలు పూర్తయిన గూఢచారిలో ఉండటం ఆనందంగా ఉంది.

    ఈ సినిమా చూసి సిగ్గు పడాలి

    ఈ సినిమా చూసి సిగ్గు పడాలి

    ఇండస్ట్రీలో ప్రతిఒక్రరూ గూఢచారి చూడాలి. ఎంత బడ్జెట్‌లో చేశారా చూడాలి, ఎలా కష్టపడ్డారో అని చూడాలి. చాలా మంది నేర్చుకోవాలి, కొంత మంది సిగ్గు పడాలి. అవసరం లేకుండా బడ్జెట్ పెంచేవారు, లేడీజీగా పని చేవారికి ఈ సినిమా ఒక మంచి పాఠం.

    ఆ వెదవలతో నాకు సంబంధం లేదు

    ఆ వెదవలతో నాకు సంబంధం లేదు

    నా 30 ఏళ్ల కెరీర్లో నాకు సపోర్ట్ చేసిన మనసున్న మంచి మనుషులందరికీ థాంక్స్. వెధవలకు నాకు వాడీకీ సంబంధం లేదు. కాని సమస్య ఏంటంటే వాళ్లు వెధవలని ఎవరికీ తెలియదు. ఎందుకంటే నువ్వు వెధవ అని ఎవరూ చెప్పరు ఇక్కడ అని జగపతి బాబు వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో జగపతి బాబును కొందరు మోసం చేశారనే ప్రచారం ఉంది. వారిని ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేసి ఉంటారని టాక్.

    English summary
    Jagapati Babu Emotional words speech about Goodachari Thanks meet. Goodachari is a spy thriller film, produced by Abhishek Nama, T.G.Vishwa Prasad, Abhishek Agarwal on Abhishek Pictures, People Media Factory & Vista Dream Merchants banner and directed by Sashi Kiran Tikka. The film stars Adivi Sesh, Sobhita Dhulipala, and Madhu Shalini in the lead roles, while Prakash Raj, Jagapati Babu, Supriya Yarlagadda, and Vennela Kishore appear in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X