ఐ లవ్ xxx, అందుకే వాళ్లకు ప్రేమ.. ఆ విషయంలో చిరంజీవి పిల్లాడు.. బోల్డ్‌గా జగపతిబాబు
స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకొంటున్న విలక్షణ నటుడు జగపతిబాబును పలు అవార్డులు పలుకరిస్తున్నాయి. హీరోగా చేసినప్పుడు అవార్డులు పెద్దగా అందలేదు. తాజాగా వైజాగ్‌లో జరిగిన టీఎస్సాఆర్ అవార్డుల కార్యక్రమంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించినందుకు గాను జగపతిబాబుకు బెస్ట్ క్యారెక్టర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును చిరంజీవి చేతుల మీదుగా జగపతిబాబు అందుకొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..

చిరంజీవితోనే ఇండస్ట్రీలో నా తొలి అడుగు
చిరంజీవి గారితోనే నా సినీ తొలి అడుగు పడింది. నా తొలి సినిమాకు ఓపెనింగ్ షాట్‌కు క్లాప్ కొట్టారు. చిత్ర పరిశ్రమలోకి నన్ను స్వాగతించారు. ఇక సైరా సినిమాలో చిరంజీవితో నటించిన అనుభూతి గొప్పగా ఇంకా కొనసాగుతుండగానే ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.

చిరంజీవిది పిల్లాడి మనస్తత్వమని
చిరంజీవిని సినిమాలపరంగా చూసి ఉండవచ్చు. బయట నుంచి మరొక రకంగా చూడొచ్చు. కానీ నేను ఆయనను మరో రకంగా చూసి ఉన్నాను. ఆయనలో ఓ పసిపిల్లవాడు ఉన్నాడు. అందరితో కలిసిపోయి, ఎంకరేజ్ చేస్తూ సెల్ఫీలు తీసుకోవడం చూసి గొప్పగా అనిపించింది. నిజంగా ఆయన గ్రేట్ మ్యాన్, హ్యాట్సాఫ్ సర్ అని జగపతి బాబు అన్నారు. ఆయన గురించి ఏం చెప్పిన తక్కువే అని పేర్కొన్నారు.

విలన్‌గా మారిన తర్వాత అవార్డులు
నేను హీరోగా చేసినప్పుడు నాకు అవార్డుల రాలేదు. విలన్‌గా చేస్తూ ఎలాంటి పాత్రలు వేసిన అవార్డులు వస్తున్నాయి. నాకు ఇది అర్థం కావడం లేదు. నా టైం బాగుంది. నేను బాగుంది. అందరూ మంచిగా ఉండాలని కోరుకొంటున్నాను.

ప్రపోజల్స్ వస్తున్నాయా అని యాంకర్ ప్రదీప్
అవార్డు అందుకొన్న సందర్బంగా జగపతిబాబును ఉద్దేశించి యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. హీరోగా చేసినప్పుడు బాగానే ప్రపోజల్స్ వచ్చి ఉంటాయనుకొంటాను. అలాగే విలన్‌గా చేస్తున్నప్పుడు ప్రపొజల్స్ వస్తున్నాయా సార్ అని అడిగాడు. దాంతో ఎలాంటి ప్రపోజల్స్ అని జగపతిబాబు ప్రశ్నించగా.. ఏమో సార్.. మీరు ఫ్యామిలీ హీరో.. ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువే కదా అని ప్రదీప్ తడబడ్డాడు.

ఐ లవ్ ఉమెన్.. అందుకే వాళ్లకు
యాంకర్ ప్రదీప్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. నాకు మహిళా అభిమానులు ఉండటం నిజమే. ఫీమేల్ ఫాలోయింగ్ అంటే ఐ లవ్ ఉమెన్.. అందుకే వాళ్లు లవ్ చేస్తారు అని జగపతిబాబు అనగానే.. అందరూ సూపర్బ్ అన్సర్.. కంగ్రాట్యులేషన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
నాగార్జునకు నా థ్యాంక్స్
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి కారణమైన నాగార్జున గారికి, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు థ్యాంక్స్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











