ఇప్పటికీ మహేశ్ సినిమాలో నటించాలని ఉంది.. వారి గురించి మాట్లాడను అంటూ జగపతిబాబు ఆవేదన

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'లెజెండ్'లో విలన్‌గా నటించిన తర్వాత జగపతిబాబు కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటి నుంచి ఈ విలక్షణ నటుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం సహా పలు భాషల్లో నటిస్తున్నారు. దీంతో తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి ఆయన ఓ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు.

జగపతిబాబే తప్పుకున్నాడని..

జగపతిబాబే తప్పుకున్నాడని..

‘సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి జగపతిబాబు తప్పుకున్నాడని నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఎందుకు తప్పుకున్నారో క్లారిటీ అయితే లేదు కానీ, ఈ సినిమా కథ చెప్పే సమయంలో దర్శకుడు ఏమైతే నేరేట్ చేశాడో.. షూటింగ్‌కు వెళ్లిన తర్వాత కనిపించిన కథ మరోలా ఉండడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

మరో రకమైనా ప్రచారమూ జరుగుతోంది

మరో రకమైనా ప్రచారమూ జరుగుతోంది

జగపతిబాబు తప్పుకోవడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆయన సినిమా నుంచి తప్పుకోలేదని.. జగ్గూభాయ్‌నే చిత్ర యూనిట్ తొలగించిందని కూడా ప్రచారం జరుగుతోంది. చిత్ర దర్శకుడిని కథ గురించి ప్రశ్నించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా అనుకుంటున్నారు. షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఈ సంఘటనను అవమానంలా భావించే జగ్గూభాయ్ తప్పుకున్నాడని చిత్రసీమలో ఓ వార్త కలకలం రేపుతోంది.

జగ్గూభాయ్ స్పందన

‘సరిలేరు నీకెవ్వరు' నుంచి జగపతిబాబు తప్పుకున్నారన్న వార్త కన్ఫార్మ్ కాకముందే దీనిపై ఎన్నో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలింనగర్‌లో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో జగపతిబాబు దీనిపై స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.

xతప్పుకున్నానని చెప్పేశాడు

xతప్పుకున్నానని చెప్పేశాడు


తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో జగపతిబాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేసేశాడు. ‘‘కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరలేదు. అంతేకానీ, దీని వెనుక ఎటువంటి గొడవలు, వివాదాలు లేవు. మహేష్‌ బాబు సినిమా నుంచి నన్ను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు'' అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

33 ఏళ్లలో తొలిసారి వివరణ ఇస్తున్నా

33 ఏళ్లలో తొలిసారి వివరణ ఇస్తున్నా

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయన్న జగపతిబాబు.. వాటిపై ఏ రోజూ స్పందించలేదని అన్నారు. అయితే, 33 ఏళ్ల సినీ జీవితంలో తొలిసారి వివరణ ఇస్తున్నానని చెప్పారు.

మహేశ్ సినిమాలో చేయాలనుంది

మహేశ్ సినిమాలో చేయాలనుంది

సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ ‘సరిలేరు నీకెవ్వరు'లో చేయాలని ఉందని జగపతిబాబు అన్నారు. ‘‘ఈ క్యారెక్టర్‌ అంటే నాకు చాలా ఇష్టం. మహేష్‌ సినిమా కోసం రెండు చిత్రాలను కూడా వదులుకున్నాను. ఇప్పటికీ నాకు చేయాలని ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఆ చిత్రంలో నటించడం కుదరలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆల్‌ ద బెస్ట్‌ మహేశ్

ఆల్‌ ద బెస్ట్‌ మహేశ్

‘సరిలేరు నీకెవ్వరు' నుంచి తప్పుకున్నప్పటికీ జగపతిబాబు మహేష్‌తో పాటు చిత్ర యూనిట్‌కి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ‘సినీ పరిశ్రమ అనేది నా కుటుంబంతో సమానం. వారి గురించి మాట్లాడటం సరికాదు. కానీ, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది'' అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X