క్యాసినోలో జగపతి బాబు ఎంజాయ్.. సిగ్గు శరం లేని వాడిని అంటూ!

పెద్ద సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినా.. అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగారు జగపతి బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను అందుకున్న ఆయన.. వరుస సినిమాలతో సత్తా చాటారు. ఇలా దాదాపు మూడు దశాబ్ధాల పాటు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన.. కొన్నేళ్ల క్రితం విలన్‌గా మారిపోయారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడడం లేదు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగపతి బాబు క్యాసినోలో కనిపించారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

అలా ఎంట్రీ.. ఫ్యామిలీ హీరోగా
జగపతి బాబు'మంచి మనుషులు' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 'సింహ స్వరూపం' అనే చిత్రంతో హీరోగా మారారు. అప్పటి నుంచి దాదాపు వందకు పైగానే సినిమాల్లో నటించారు. తద్వారా ఫ్యామిలీ హీరోగా పేరొందారు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను సైతం సొంతం చేసుకున్నారు. అదే సమయంలో పలు అవార్డులు తీసుకున్నారు.

Jagapati Babu Latest Casino Photo Gone Hot Topic In Film Industry

బాలకృష్ణ సినిమాతో కొత్తగానే
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో జగపతి బాబు.. నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్'తో విలన్‌గా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలోని నటనతో అప్పటి నుంచి ఆయన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో వరుసగా విలన్ పాత్రలను, సపోర్టింగ్ రోల్స్‌ను చేస్తూ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

దేనికదే చేస్తూ యమా బిజీగా
ప్రతినాయకుడి పాత్రలు పోషించడం ప్రారంభించిన తర్వాత జగపతి బాబు ఎన్నో మరపురాని క్యారెక్టర్లను చేశారు. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాల్లో క్రూరమైన విలన్‌గా నటించి మెప్పించారు. ఇలా తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడం సహా పలు భాషల్లో నటిస్తున్నారు. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా నడుపుకుంటున్నారు.

Jagapati Babu Latest Casino Photo Gone Hot Topic In Film Industry

సోషల్ మీడియాలో బిజీగానే
చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ స్టార్ యాక్టర్ జగపతి బాబు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం వదులుతూ తన క్రేజ్ పెంచుకుంటున్నారు.

క్యాసినోలో మరోసారి రచ్చగా
పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న జగపతి బాబు.. తాజాగా ఓ పర్సనల్ ట్రిప్‌లో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన రాయల్ క్యాసినో (Casino) గేమ్స్ ఆడే ప్రదేశానికి వెళ్లి తీసుకున్న ఫొటోను జగపతి బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి 'సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను. మీరు చెప్తే పడతాను' అని క్యాప్షన్ పెట్టారు.

డబ్బు పోయినా మళ్లీ మళ్లీ
వాస్తవానికి జగపతి బాబుకు కొన్ని కోట్ల ఆస్తులు ఉండేవి. కానీ, ఆయన క్యాసినో లాంటి జూదానికి అలవాటు పడి చాలా పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కానీ, ఇప్పుడు మరోసారి జగపతి బాబు అదే ప్రదేశానికి వెళ్లి దిగిన ఫొటోను పెట్టారు. ఇది చూసిన వాళ్లంతా 'నిజంగానే మీకు సిగ్గు లేదు సార్' అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X