జగపతి బాబు బ్రదర్ గా చెయ్యమన్నా చేస్తాడు. హీరోయిన్ ని వేరే వారికి త్యాగం చేసే పాత్రలూ చేస్తాడు. ఇప్పుడు ధైర్యంగా కుచేలుడు చిత్రంకోసం బార్బర్ గా కనిపించబోతున్నాడు. ఆ క్రమంలో మరి ఇప్పుడు పులిహార సినిమాలు కూడా ఒప్పుకుంటున్నాడా అని అనుమానం వస్తుంది. అదేం కాదట...ఆయన ఒప్పుకున్న కొత్త సినిమా టైటిల్ 'పులిహార'. 'ఒక ఊరిలో...' చిత్రం దర్శకుడుగా పరిచయం అయిన రమేశ్ వర్మ తరువాత సినిమాట అది. కథ జగపతి బాబుకు బాగా నచ్చిందిట. అందులోనూ టాగ్ లైన్ అయిన 'రెండున్నర గంటల తాలింపు' అయితే కేక అన్పించిందిట. మరింకేం శుభమస్తు.