ఒక్క ఫోటోతో జీవితమే మారిపోయింది.. ఆటోలో వచ్చి చులకనగా, లెజెండ్ ఛాన్స్.. జగపతి బాబు!

విలన్ పాత్రల్లో జగపతి బాబు ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఆయనకు ఇది సెకండ్ ఇన్నింగ్స్. కెరీర్ ఆరంభంలో కుటుంబకథా చిత్రాలతో అలరించిన జంగపతి బాబు ఇలా విలన్ గా మెప్పిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు విలన్ గా తన అవకాశాలు గురించి వివరించారు. చాలా కాలం పాటు అవకాశాలు లేక తన పరిస్థితి ఎలా మారిందో తెలిపారు.

ఆటోలో వచ్చి

ఆటోలో వచ్చి

ఓ వ్యక్తి ఆటోలో వచ్చి తాను తెరకెక్కించబోయే సినిమాలో క్యారెక్టర్ రోల్ పోషించాలని అడిగాడు. డైరెక్టర్, నిర్మాత, హీరో అన్ని నేనే.. మరి నేను ఏంటి అని అడిగాను. క్యారెక్టర్ రోల్ అని చెప్పాడు. ఈ ఉదాహరణ చాలా నా పరిస్థితి ఎలా ఉందొ వివరించేందుకు అని జగపతి బాబు తెలిపాడు.

ఒక్క ఫోటోతో

ఒక్క ఫోటోతో

అలాంటి సమయంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో ఫోటో షూట్ చేశాను. ఆ ఫోటో గ్రాఫర్ కు రుణపడి ఉంటా. అప్పుడే బాలయ్య, బోయపాటి సినిమా లెజెండ్ ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఫోటో బోయపాటి కంట పడింది.

ఫోన్ కోసం

ఫోన్ కోసం

లెజెండ్ చిత్రంలో విలన్ గా నన్ను అనుకుంటున్నారని తెలిసింది. అప్పటినుంచి ఫోన్ కోసం ఎదురుచూశా. పది రోజులు గడచినా ఫోన్ రాలేదు. చివరకు నన్ను ఎంపిక చేసి రెమ్యునరేషన్ మాట్లాడేందుకు వచ్చారు. నా మనసులో ఒక నంబర్ అనుకుని ఉన్నాను. వాళ్ళు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ నేను అనుకున్నదానికంటే డబుల్. ఎగిరి గంతేసినంత పని చేశా. వెంటనే లెజెండ్ చిత్రంలో నటించడం, అది ఘనవిజయం సాధించడం జరిగింది.

క్రేజీ విలన్

క్రేజీ విలన్

ఆ తరువాత జగపతి బాబు నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, రంగస్థలం చిత్రాలలో జగపతి బాబు అద్భుత నటన కనబరిచారు. దీనికంతటికి కారణం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దిగిన ఫొటో షూట్ అని జగపతి బాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X