టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగారు జగపతి బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న ఆయన.. వరుస సినిమాలతో సత్తా చాటారు. ఇలా దాదాపు రెండు దశాబ్ధాల పాటు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన.. కొన్నేళ్ల క్రితం విలన్‌గా మారిపోయారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడడం లేదు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. ఫ్యామిలీ హీరోగా పేరు

అలా పరిచయం.. ఫ్యామిలీ హీరోగా పేరు


'మంచి మనుషులు' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు జగపతి బాబు. ఆ తర్వాత 'సింహ స్వరూపం' అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి దాదాపు వందకు పైగానే సినిమాల్లో నటించారు. తద్వారా ఫ్యామిలీ హీరోగా పేరొందారు. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను సైతం సొంతం చేసుకున్నారు. అదే సమయంలో పలు అవార్డులు అందుకున్నారు.

పొట్టి దుస్తుల్లో శృతిహాసన్ గ్లామర్ షో... మీరెప్పుడూ చూడని లవ్లీ పిక్స్

బాలకృష్ణ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్

బాలకృష్ణ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'లెజెండ్'తో విలన్‌గా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు జగపతి బాబు. ఈ సినిమాలోని నటనతో అప్పటి నుంచి ఆయన కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో వరుసగా విలన్ పాత్రలనే పోషిస్తూ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

క్రూరమైన విలన్‌గా మార్పు... దేనికదే

క్రూరమైన విలన్‌గా మార్పు... దేనికదే

నెగెటివ్ పాత్రలు పోషించడం ప్రారంభించిన తర్వాత జగపతి బాబు ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాల్లో క్రూరమైన విలన్‌గా నటించి మెప్పించారు. ఇలా తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడం సహా పలు భాషల్లో నటిస్తున్నారు. దీంతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా నడిపించుకుంటున్నారాయన.

రాబర్ట్‌తో పోటీగా.... కన్నడ సినిమాలో

రాబర్ట్‌తో పోటీగా.... కన్నడ సినిమాలో

కన్నడ చిత్ర పరిశ్రమలో ఛాలెంజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో దర్శన్. తరుణ్‌ సుధీర్ దర్శకత్వంలో అతడు నటించిన చిత్రం 'దర్శన్'. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఆశా భట్ హీరోయిన్‌. జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. ఉమాపతి ఫిల్స్ బ్యానర్‌పై ఉమాపతి శ్రీనివాస్ గౌడ నిర్మించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

టాలీవుడ్‌పై బాబు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌పై బాబు సంచలన వ్యాఖ్యలు


ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రాబర్ట్' మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి జగపతి బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కన్నడ పరిశ్రమలో నాకెంతో రెస్పెక్ట్ దొరికింది. అంతటి గౌరవం తెలుగులో కనిపించదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాళ్ల గురించి చాలా విషయాలు చెప్పాలి

వాళ్ల గురించి చాలా విషయాలు చెప్పాలి

దర్శన్ గురించి మాట్లాడుతూ.. 'నేను ఫంక్షన్లకు రావడం మానేశాను. ఆ విషయం మీకు తెలుసు. కానీ, దీనికి నేను రావాలనుకున్నా. ఎందుకంటే కన్నడ వాళ్లను చూడాలి.. వాళ్లతో మాట్లాడాలి.. వాళ్ల గురించి చెప్పాలి. దర్శన్ కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉంటాయి. తల కూడా నేల మీదే ఉంటుంది. కానీ, మనిషి ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. అతనొక రియల్ స్టార్' అని చెప్పారాయన.

వాస్తవాలే మాట్లాడతానంటూ ప్రశంసలు

వాస్తవాలే మాట్లాడతానంటూ ప్రశంసలు

జగపతి బాబు కొనసాగిస్తూ.. 'నిజానికి నేను ఇదే నిర్మాతతో వేరే సినిమా చేశాను. మైసూర్‌లో షూటింగ్ చేస్తున్నాం. నేనున్నానని తెలిసి దర్శన్ నా కోసం అందరినీ పిలిచి నాకు మరోసారి స్వాగతం చెబుతూ గెట్ టుగెదర్ జరిపాడు. దీన్ని బట్టి ఆ మనిషి ఒక మంచి వ్యక్తో మీరు ఆలోచించుకోవచ్చు. మీ అందరికీ తెలుసు నేను ఎవరినీ పొగడనని.. నేను నిజమే చెబుతాను. అంతకంటే నాకు ఏం రాదు' అంటూ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X