చిట్టిబాబు చింపేశాడు.. నేనే చంపేయాలనుకొన్నాను.. పవన్ అంటే ఇష్టం.. జగపతిబాబు

By Rajababu

రంగస్థలం సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ బ్యానర్ అధినేతలు నవీన్, రవి, మోహన్ కలిసి హైదరాబాద్‌లో రంగస్థలం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రసిడెంట్ పాత్రను పోషించిన జగపతిబాబు మాట్లాడుతూ.

Recommended Video

Rangasthalam Success Meet : Pawan Kalyan Emotional Speech
 వసూళ్ల వరద..

వసూళ్ల వరద..

రిలీజ్ తర్వాత డిస్టిబ్యూటర్లని కలెక్షన్ల గురించి అడిగితే వసూళ్లు వరదలా పారుతున్నాయి. ఎంత వస్తుందో తెలియడం లేదు. ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదని చెప్పినప్పుడు చాలా సంతోషం కలుగుతున్నది.

పవన్ రాకతో మరింత పవర్‌ఫుల్

పవన్ రాకతో మరింత పవర్‌ఫుల్

అంతటి పవర్‌ఫుల్ సినిమా ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రావడం మరింత పవర్‌ఫుల్‌గా మారింది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ ఉండటం మరింత ఆకర్షణగా మారింది.

 30 ఏళ్ల కెరీర్‌లో

30 ఏళ్ల కెరీర్‌లో

పవన్ కల్యాణ్ నాకు బాగా నచ్చిన వ్యక్తి. ఆయన ఈ వేడుకలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. 30 ఏళ్ల కెరీర్‌లో ప్రసిడెంట్ క్యారెక్టర్ మంచి పేరు తెచ్చింది. దాదాపు 15 మందికిపైగా ఆర్టిస్టులు బాగా చేశారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్‌ దక్కుతుంది.

రంగస్థలంతో బాలీవుడ్‌కు

రంగస్థలంతో బాలీవుడ్‌కు

ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో నటించాలని ఎదురుచూసున్నాను. ఆ కల రంగస్థలం సినిమాతో తీరింది. బాలీవుడ్‌లో పెద్ద హీరోతో పనిచేస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను.

 చరణ్ చింపేశాడు..

చరణ్ చింపేశాడు..

రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్‌లో రాంచరణ్ తన నటనతో చింపేశాడు. సినిమా చూస్తున్న సేపు ఓ దశలో ప్రసిడెంట్ క్యారెక్టర్‌ను నేనే చంపేయాలని అనుకొన్నాను. దానిని బట్టి రాంచరణ్ నటన ఎంత హైలెట్‌గా నిలిచిందో చెప్పవచ్చు.

సమంత క్యూట్‌గా

సమంత క్యూట్‌గా

సమంత క్యూట్‌గా ఉంది. రంగమ్మత్త పాత్రలో అనసూయ, కుమార్‌గా ఆది పినిశెట్టి, జబర్దస్త్ మహేష్, అజయ్ ఘోష్ లాంటి పాత్రలు అద్భుతంగా పండాయి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు హైలెట్‌గా నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X