twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబు దొరికిపోయాడు.. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ

    టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఎన్టీఆర్ బయోపిక్. ఓ వైపు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వైపు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లకు సిద్ధమవుతున్నారు. అయితే షూటింగ్ ప్రారం

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఎన్టీఆర్ బయోపిక్. ఓ వైపు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వైపు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌లకు సిద్ధమవుతున్నారు. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక వివాదాలు ఈ చిత్రాలను చుట్టుముట్టడం, పాత్రల ఎంపిక విషయం చాలా ఆసక్తిని రేపుతున్నది.

    Recommended Video

    చంద్రబాబు క్యారెక్టర్ లో ఈ హీరో నా ?
     ఎన్టీఆర్ బయోపిక్‌పై చర్చ

    ఎన్టీఆర్ బయోపిక్‌పై చర్చ

    తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర తెరకెక్కుతున్నదనే విషయం బయటకు రాగానే విస్తృతంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో అనేక కోణాలు ఉండటమే.

    ఎన్టీఆర్ అంటే ఓ కిక్కు

    ఎన్టీఆర్ అంటే ఓ కిక్కు

    ఎన్టీఆర్ జీవితంలో సాధించిన విజయాలు, సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎన్టీఆర్ చేసిన కృషి, తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ పార్టీ పెట్టి ప్రజల్లోకి రావడమే అంశాలు మస్తుగా ప్రేక్షకులకు కిక్కెక్కించడం సహజం. అంతేకాకుండా మహానుభావుడి చివరి అంకంలో అనుభవించిన క్షోభ మాటల్లో చెప్పలేనది.

     ఒడిదుడుకులతో ఎన్టీఆర్

    ఒడిదుడుకులతో ఎన్టీఆర్

    రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎన్టీఆర్‌కు తప్పలేదు. నాదేండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఇలాంటి ఎందరో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన వారున్నారు. ఇదంతా ఒకటైతే రామారావును ముఖ్యమంత్రి పదవిలో నుంచి దించేందుకు జరిగిన వైస్రాయ్ ఉదంతం తెలుగు దేశం పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టం.

     ఎన్టీఆర్ వెన్నుపోటు!

    ఎన్టీఆర్ వెన్నుపోటు!

    అధికార మార్పిడిలో భాగంగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణలను ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అప్పట్లో ఎదుర్కొన్నారు. పదవి కోల్పోయాక ఎన్టీఆర్ స్వయంగా ఆరోపణలు సంధించారు కూడా. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.

     అనేక వివాదాల మధ్య

    అనేక వివాదాల మధ్య

    ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తే ఇలాంటి అంశాలన్నింటినీ ప్రజలకు చూపించాల్సి వస్తుంది. ఒకవేళ చూపించకపోతే జీవిత చరిత్రకు పరమార్థం ఉండదు అనే మాట ఓ వర్గం నుంచి వినిపిస్తున్నది. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించివేసే ప్రక్రియలో ఒక వర్గం చంద్రబాబు‌ను విలన్‌గా చూపించడానికి, మరో వర్గం లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశాలు.

     చంద్రబాబుగా జగపతిబాబు

    చంద్రబాబుగా జగపతిబాబు

    ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రను ఎవరు పోషిస్తారు? అనే అంశం సినీ, ప్రేక్షక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను సినీ నటుడు జగపతి‌బాబు పోషిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది.

    గట్స్ ఉన్న నటుడు జగపతి

    గట్స్ ఉన్న నటుడు జగపతి

    కులం, మతం, ప్రాంతం అనే అంశాలకు జగపతిబాబు అతీతుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే సినీ నటులు పెదవి విప్పడానికి భయపడ్డారు. అలాంటి నేపథ్యంలో జై బోలో తెలంగాణలో జగపతిబాబు నటించి రెండు ప్రాంతాల ప్రజలను మెప్పించాడు.

     జగపతిబాబు సిద్ధపడితే

    జగపతిబాబు సిద్ధపడితే

    ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో అత్యంత వివాదాస్పద పాత్రను పోషించేందుకు జగపతిబాబు సిద్ధపడితే.. దానికి కూడా న్యాయం చేకూరస్తారనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా జగపతిబాబు అయితే కరెక్ట్‌గా సరిపోతాడు అని నందమూరి అభిమానుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Between many controversies, NTR Biopic is moving towards progressing way. Reports Suggest that Actor Jagapati Babu is playing importent role of Chandrababu in NTR Biopic. This movie is going to direct by Teja.NTR's son Balakrishna is playing lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X