సైనికుడులో ఎవరా అతిథి?
వైజయంతీ మూవీస్ ప్రతిష్ఠాత్మక చిత్రం సైనికుడు ప్రస్తుతం శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రంలో ఒక విశేషం గురించి బయటకు పొక్కింది. ప్రముఖ నటుడు జగపతిబాబు సైనికుడు చిత్రంలో ఒక అతిథి పాత్రను పోషించారన్నది ఆ సమాచారం. మల్టీస్టారర్ చిత్రాలలో నటించేందుకు జగపతిబాబు ఎప్పుడూ ముందుంటారు. అంతఃపురం, అనుకోకుండా ఒక రోజు వంటి చిత్రాలలో ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ చిత్రాలు విజయవంతం కావడానికి ఎంతో దోహదపడ్డారు.
వైజయంతీ మూవీస్ వారి రావోయి చందమామ చిత్రంలో కూడా జగపతిబాబు నటించారు కానీ అది ఫ్లాప్ అయింది. కానీ, ఇటీవలి కాలంలో ఆయన గెస్ట్ పాత్ర పోషిస్తే తమ చిత్రం హిట్టే అన్న సెంటిమెంట్ నిర్మాతల్లో బాగా నాటుకుపోయింది. సైనికుడు చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ ఎంతో శ్రద్ధతో చిత్రీకరిస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు. మహేశ్‌బాబు, త్రిషల గురించి ఇంక చెప్పనవసరం లేదు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం హిట్ ఆల్బమ్‌గా నమోదయింది. ప్రస్తుతం అందరి కళ్లూ నవంబర్ మూడో వారంలో విడుదల కాబోయే సైనికుడు చిత్రం మీదనే.


Click it and Unblock the Notifications