రాజకీయ నాయకుడిగా జగపతిబాబు, ఏ సినిమాలోనో తెలుసా?
మాస్ మహారాజ్ రవితేజ 'నేల టికెట్'తో వచ్చేస్తున్నాడు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మాళవిక శర్మ ఈ సినిమలో హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఆడియో ఫంక్షన్ ఈ నెల 10న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కు రాబోతున్నాడు.
ఈ సినిమలో మినిస్టర్ పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడు. విలన్ గా జగపతి బాబు పాత్రను దర్శకుడు బాగా తీర్చిదిద్దాడని సమాచారం. రవితేజ, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధాన బలం కానున్నాయని సమాచారం. ఎన్నో పాత్రల్లో మెప్పించిన జగపతి బాబు రాజకీయ నాయకుడిగా నేల టికెట్ సినిమాలో తన నటవిశ్వరూపాన్ని చుపించబోతున్నాడని సమాచారం.

యువ సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను పై మంచి అంచనాలు ఉన్నాయి. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ ఈ సినిమాతో మరో విజయం సాధిస్తాడని ఆశిద్దాం. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











