పెళ్లి చేసుకొన్న జబర్దస్త్ కమెడియన్ మహేష్.. పెళ్లికూతురు ఎవరంటే?

జబర్దస్త్ కామెడీ షోలో అద్బుతమైన నటనను ప్రదర్శించి ఆకట్టుకొన్న మహేష్ ఓ ఇంటివాడయ్యాడు. చిన్న చిన్న పాత్రలతో వెండితెర మీద రాణిస్తున్న మహేష్ వివాహం చేసుకొన్నారు. లాక్‌డౌన్ కారణంగా గుట్టుచప్పుడు కాకుండా హంగులు, ఆర్బాటాలకు దూరంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నాడు. కమెడియన్ మహేష్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరిగిందంటే...

Recommended Video

Jabardast Comedian Mahesh Got Married During Lockdown, Pics
జబర్దస్త్ ద్వారా యాక్టింగ్‌లోకి

జబర్దస్త్ ద్వారా యాక్టింగ్‌లోకి

జబర్దస్త్‌లో కిరాక్ ఆర్పీ టీమ్‌లో మహేష్ కీలక సభ్యుడిగా ఉండటంతోపాటు ఆ టీమ్‌కు వెన్నుముకగా నిలిచాడు. మహేష్ వేసే పంచులు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించారు. అలా బుల్లి తెర నుంచి వెండితెర వరకు ప్రయాణం కొనసాగించి నటుడిగా గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల శతమానం భవతి, రంగస్థలం, గుణ 369 చిత్రాల్లో మహేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 ఈస్ట్ గోదావరి జిల్లాలో

ఈస్ట్ గోదావరి జిల్లాలో

ఇలా నటుడిగా దూసుకెళ్తున్న మహేష్ వివాహం పావనితో జరిగింది. మే 14వ తేదీన ఉదయం. 6.31 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగింది. ఈ వివాహా వేడుకకు అతికొద్ది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు.

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే

కమెడియన్ మహేష్ పెళ్లిని లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయ పద్దతుల్లో జాగ్రత్తగా నిర్వహించారు. పెళ్లి వేదిక వద్ద సానిటైజన్ చర్యలు చేపట్టి ఆరోగ్యకరమైన వాతావారణాన్ని ఏర్పాటు చేశారు. అతిథులంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకొన్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన చర్యల మధ్య మహేష్ ఓ ఇంటి వాడయ్యాడు.

 సినీ ప్రముఖులు దూరంగా

సినీ ప్రముఖులు దూరంగా

మహేష్ పెళ్లికి తెలుగు టెలివిజన్, సినీ తారలు, ప్రముఖులు దూరంగా ఉన్నారు. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా పెళ్లికి హాజరుకాలేని వారు తమ శుభాకాంక్షలను ఫోన్ ద్వారా అందజేశారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు అభినందనలు తెలిపారు.

లాక్‌డౌన్ తర్వాత విందు

లాక్‌డౌన్ తర్వాత విందు

ఇక తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులందరికి లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత విందును ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు లాక్‌డౌన్ కాలంలో తన సొంత ఊరులోనే ఉండే అవకాశం ఉంది. లాక్‌డౌన్ తర్వాత షూటింగులు మొదలయ్యే వరకు స్వీయ గృహ నిర్బంధంలో ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X