వార్త మమ్మల్ని బాధించింది:జగ్గయ్య మనవడు అవేదన
జగ్గయ్య మనవడు డాక్టర్ శశిధర్ మీడియాతో మాట్లాడుతూ... "మా తాతగారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారికి మేం నలుగురం సంతానం. ఇందులో ముగ్గురు మనవళ్లు, ఓ మనవరాలు వున్నారు. మా ముగ్గురిలోనూ ఎవ్వరికీ నటించాలన్న ఆసక్తి లేదు. అందుకే మా తాత గారి మరణానంతరం మేం చిత్ర పరిశ్రమతో సంబంధాలు వదులుకున్నాం. కానీ జగ్గయ్య మనవడు హీరోగా నటిస్తున్నారంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు మమ్మల్నెంతో బాధించాయి'' అని పేర్కొన్నారు.
ఇంతకీ ఈ కుటుంబాన్ని భాధపెట్టిన వార్త ఏమిటంటే...'సోగ్గాడు' శోభన్‌బాబు మేనల్లుడు రాజాబాబు, కొంగర జగ్గయ్య మనవడు రాహుల్ హీరోలుగా పరిచయమవుతున్నారు. వీరిద్దరితో కె.ఎస్.కంబైన్స్ సంస్థ ఓ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్న ఈ చిత్రానికి కోటి సంగీతం సమకూరుస్తున్నారు. నెలాఖరున పాటల రికార్డింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేశ్, నిర్మాతలు: మల్లెల కిశోర్, పి.సంగీతరావు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వెంకటస్వామి నాయుడు.


Click it and Unblock the Notifications












