twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి అసలు పేరు ఇదీ: తల్లిని కడసారి చూడలేకపోయిన జాహ్నవి, తొలి హీరో స్పందన

    By Pratap
    |

    హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి అశేషమైన ప్రేక్షక లోకాన్ని శోకసముద్రంలో ముంచేసి వెళ్లిపోయారు. దుబాయ్‌లోని బంధువు మోహిత్ మార్వాహ్ వివాహానికి హాజరైన శ్రీదేవి అక్కడే కుప్పకూలిపోయారు.

    అయితే, శ్రీదేవిని చివరి క్షణాల్లో పెద్ద కూతురు జాహ్నవి చూడలేకపోయిందని అంటున్నారు. ప్రస్తుతం న కొత్త సినిమా షెడ్యూల్‌లో బిజీగా ఉంది. జాహ్నవి తప్ప బోనీ కపూర్ కుటుంబ సభ్యులంతా ఆ వివాహానికి హాజరయ్యారు.

    Recommended Video

    హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
    మోనా మాదిరిగానే శ్రీదేవి..

    మోనా మాదిరిగానే శ్రీదేవి..

    శ్రీదేవి మరిది, హీరో సంజయ్ కపూర్ దుబాయ్ నుంచి శనివారమే భారతదేశానికి తిరిగి వచ్చారు. శ్రీదేవి మరణవార్త తెలుసుకున్న ఆయన మీడియాకు ఆ విషయం వెల్లడించారు. తర్వాత తిరిగి సంజయ్ దుబాయ్ వెళ్లిపోయారు. బోనీకపూర్ మొదటి భార్య మోనా మాదిరిగానే శ్రీదేవి కూడా తను కూతురు తొలి సినిమా చూడకుండానే మరణించారు.

    శ్రీదేవి అసలు పేరు ఇదీ..

    శ్రీదేవి అసలు పేరు ఇదీ..

    బాలీవుడ్ ఫిమేల్ సూపర్ స్టార్‌గా శ్రీదేవి పేరు ప్రఖ్యాతులు పొందారు. 13 ఆగస్టు 1963లో జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్ర అమ్మయ్యంగార్ అయ్యప్పన్. బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967 సినీ రంగ ప్రవేశం చేశారు.

    పదహారేళ్ల వయస్సులో శ్రీదేవి

    పదహారేళ్ల వయస్సులో శ్రీదేవి

    తెలుగులో శ్రీదేవి తొలి హీరో చంద్రమోహన్. పదహారేళ్ల వయస్సులో ఆయన శ్రీదేవితో కలిసి నటించారు ఆయన శ్రీదేవి మృతిపై స్పందించారు. శ్రీదేవి మరణవార్త విని షాకయ్యానని అన్నారు. ఆమె అకాల మరణం చిత్రసీమకు తీరని లోటు అని అన్నారు.

    శ్రీదేవికే చెల్లింది...

    శ్రీదేవికే చెల్లింది...

    ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక నటి శ్రీదేవి అని చంద్రమోహన్ అన్నారు. ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉండేదని, ఎంతో మంది సూపర్ స్టార్స్ పక్కన నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క శ్రీదేవికే చెల్లిందని అన్నారు. బాలనటిగా వచ్చి ఇంత స్థాయికి ఎదిగినవారు ఎవరూలేరని, చాలా మంది మధ్యలోే ఆగిపోయారని అన్నారు.

    తన భర్త వద్దకు తీసుకుని వెళ్లి....

    తన భర్త వద్దకు తీసుకుని వెళ్లి....

    శ్రీదేవి తన భర్త వద్దకు తీసుకుని వెళ్లి తన మొదటి హీరో ఇతనే అని పరిచయం చేసిందని చంద్రమోహన్ చెప్పారు. శ్రీదేవి అమ్మతో తనకు మంచి పరిచయం ఉందని చెప్పారు. వాళ్ల తనకు మిత్రుడని అన్నారు. ఆమె బాలనటిగా ఉన్నప్పడుు తమ ఇంటి వద్దే అద్దెకు ఉండేవాళ్లని చెప్పారు.

    నా పిల్లలతో ఆడుకునేది...

    నా పిల్లలతో ఆడుకునేది...

    శ్రీదేవి తమ ఇంటికి వచ్చి తన పిల్లలతో ఆడుకునేది చంద్రమోహన్ చెప్పారు. ఇక్కడ మంచి సంబంధాలు వస్తుంటే అక్కడికి ఎక్కడికో వెళ్లిపోయి ఇది వరకే వివాహమైన వ్యక్తిని పెళ్లాడిందని బాధపడేవాళ్లమని అన్నారు. అయితే అది ఆమె వ్యక్తిగతమైన విషయం కావడంతో తాము ఎవరమూ స్పందించలేదని అన్నారు.

    English summary
    Padaharella Vayssu Telugu cinema hero Chandramohan has reacted on actress Sridevi's death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X