కార్తికేయ వెడ్డింగ్: జై బాలయ్య అంటూ జూ ఎన్టీఆర్ రచ్చ రచ్చ... బిత్తరపోయిన అఖిల్!

Recommended Video

Jr NTR Shout Jai Balayya Jai Jai Balayya At SS Karthikeya's Wedding, Video Viral

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహం జైపూర్ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్ హెటల్‌లో వైభవంగా జరుగుతోంది. పెళ్లి వేడకలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, అనుష్క లాంటి స్టార్స్ అంతా సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తూనే ఉన్నాయి.

తాజాగా విడుదలైన ఓ వీడియో తెలుగు రాష్ట్రాల్లో... ముఖ్యంగా నందమూరి అభిమానుల సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇక్కడ జరిగిన పార్టీలో పాల్గొన్న యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నోట జై బాలయ్య నినాదాలు వినిపించడమే ఇందుకు కారణం.

రచ్చ రచ్చ చేసిన జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.... జై బాలయ్య, జైజై బాలయ్య అంటూ సంతోషంగా కేకలు వేస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ పక్కన జగపతి బాబు, అఖిల్ అక్కినేని, మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు.

బిత్తర పోయిన అఖిల్

రాజమౌళి తనయుడు కాక్తికేయ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ చేస్తున్న సందడి చూసి..... అక్కినేని చిన్నోడు అఖిల్ బిత్తరపోయాడు. వీడియో నిశితంగా పరిశీలిస్తే.... ఎన్టీఆర్ అరుపులు విని అఖిల్ ఎలా రియాక్ట్ అయ్యారో గమనింవచ్చు.

మన్మధుడి సందడి

మన్మధుడి సందడి

ఎస్ఎస్ కార్తికేయ పెళ్లి వేడుకలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున చాలా ఉత్సాహం కనిపించారు. తన కుమారుడు అఖిల్‌తో కలిసి ఈ పెళ్లి వేడుకకు హాజరైన ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు అమ్మాయిలు పోటీపడ్డారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్

రామ్ చరణ్, ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్.... కార్తికేయ పెళ్లి వేడుకలో ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రెస్సు కోడ్‌లో కనిపించడం విశేషం.

బాహుబలి సందడి

బాహుబలి సందడి

కార్తికేయ పెళ్లి వేడుకలో బాహుబలి స్టార్స్ ప్రభాస్, అనుష్క సందడి. ఫోటోలో రామ్ చరణ్, రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X