'జై బోలో తెలంగాణ' నైజాం కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన జై బోలో తెలంగాణా చిత్రం నైజాం ఏరియాల్లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు మూడున్నర కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేయనున్నదని చెప్తున్నారు. అలాగా నైజాం ప్రాంతంలో ఇప్పుడిప్పుడే తీసేసే అవకాసం లేదని లాంగ్ రన్ నడుస్తుందని, ధియోటర్ల యజమానులు కూడఈ చిత్రాన్ని ఉత్సాహంగా ప్రదర్శిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా గద్దర్ పాటను ప్రతీ షోకు ధియోటర్లలో రెండు మూడు సార్లకు పైగా వేస్తున్నారని అది చాలు ఈ చిత్రం ఏ రేంజి విజయం సాధించిందో అంచనావేసేందుకు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణా అంశం ప్రస్దావిస్తూ వచ్చిన ఈ చిత్రంలో సందీప్, మీరా నందన్, స్మృతి ఇరానీ, నాగినీడు ముఖ్యపాత్రల్లో చేసారు. ఇక జగపతిబాబు చేసింది గెస్ట్ గా అయినా సినిమాకు కీలకమై నిలిచారు. కొద్ది క్షణాలే కనిపించిన కేసీఆర్ సైతం చిత్రంలో ప్రధాన ఆకర్షణ అయ్యారు.


Click it and Unblock the Notifications











