తెలంగాణ జీవన పోరాట సజీవ చిత్రం(జై బోలో తెలంగాణ ప్రివ్యూ)
ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతున్న జై బోలో తెలంగాణ చిత్రం...తరతరాల తెలంగాణ పోరాటానికి ప్రతీక బందగి గోపన్న కధను చెప్తుంది. బందగి గోపన్నగా జగపతి బాబు కనిపించనున్నారు. తెలంగాణ పోరాటానికి గుర్తుగా ఒక తండ్రి తన కొడుక్కి పెట్టుకొన్న పేరు అది. బందగి అంటే ఒక ముస్లిమ్, గోపన్న హిందువు. ఇక బందగి గోపన్న తన పుట్టుక, పెరుగుదల అన్నీ ఉద్యమంలో భాగమే అని నమ్మిన వ్యక్తి. ఆశయ సాధన ధ్యేయంగా ముందడుగు వేయడమే ఆయనకు తెలిసినది..పోరుబాటలో పయనించి అమరుడయ్యే ఒక ఉద్యమకారుడి పాత్ర అది. ఆ ఉద్యమ క్రమంలో గోపన్నకు ఎదురైన అనుభవాలేమిటి? తన ఆశయం ఎలా నెరవేరిందనేదే జై బోలో తెలంగాణ కథ. వర్షిత్ (సందీప్), సహజ (మీరా నందన్) అనే ప్రేమ జంట తెలంగాణ ఉద్యమంలో ఎలా పాలుపంచుకొందనే అనేది మరో ప్లాట్ గా రన్ అవుతుంది. కోదండరామ్, చుక్కా రామయ్య, మీరానందన్ తదితరులపై చిత్రించిన ఆ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.చిత్రం గురించి దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ ''సామాజిక బాధ్యతతో కూడిన ఉద్యమ నేపథ్యమే మా చిత్ర కథ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపడుతుంది. ప్రేమ, కుటుంబం, పోరాటం, త్యాగం, యుద్ధం, అమరత్వం తదితర విషయాలను నిజాయతీగా చూపించే ప్రయత్నం చేశాం. చక్రి చక్కటి సంగీతం అందించారు. పాటలు మంచి ఆదరణ పొందాయన్నారు.


Click it and Unblock the Notifications











