»   » ప్రియాంక చోప్రా అదరగొట్టింది (కొత్త ట్రైలర్)

ప్రియాంక చోప్రా అదరగొట్టింది (కొత్త ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా నటించిన బాలీవుడ్ చిత్రం 'జై గంగాజల్‌'. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ చిత్రానికి స్వయంగా కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. 2003లో అజయ్‌ దేవగణ్‌ నటించిన గంగాజల్‌ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. మార్చి 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదదలైన ట్రైలర్ కు మంచి స్పందన రాగా.... తాజాగా రెండో ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్లలో అదరగొట్టింది.

విడుదలకు ముందే ఈ చిత్రం వివాదంలో ఇరుక్కుంది. సెన్సార్‌ సభ్యులు సినిమాని చూసి 'సాలా' అని ఉపయోగించిన ప్రతి చోట మ్యూట్‌ చేయాలని, అలాగే అభ్యంతరకర పలు సన్నివేశాల్లో 11 కట్స్‌ ఇస్తూ 'యు/ఎ' సర్టిఫికెట్‌ని జారీ చేసింది. అయితే ఈ సర్టిఫికెట్‌ తీసుకునేందుకు దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా నిరాకరించడంతో వివాదం నెలకొంది.

'Jai Gangaajal' Official Trailer 2

''సాలా' అనే పదం జనం వాడుక భాషలో ఓ భాగమైంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జాతికి వ్యతిరేకంగా ఉండే పదాలను నేను ఉపయోగించలేదు. ప్రజలు మాట్లాడుతున్న భాషలో మమేకమైన పదాల్నే ఎంచుకున్నాను. వీటిపై సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం తెలపడం హాస్యాస్పదం. సమాజంలో నేనూ ఒక బాధ్యతగల దర్శకుడినే. 2003లో 'గంగాజల్‌' చిత్రాన్ని రూపొందించాను. అందులో అతి హింసతోపాటు 'సాలా' లాంటి ఎన్నో పదాల్ని ఉపయోగించాను. అప్పడు సెన్సార్‌వాళ్ళు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ సినిమా వివిధ టెలివిజన్‌ ఛానెళ్ళలో దాదాపు 300 సార్లు ప్రదర్శితమైంది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు కొత్తగా సెన్సార్‌ వాళ్ళకి రావడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ మండి పడ్డారు.

English summary
Written and directed by Prakash Jha, produced by Prakash Jha Productions and Play Entertainment and co-produced by Milind Dabke, Jai Gangaajal revisits the dusty heartland of Central India, and examines the society– police relationship. Starring Priyanka Chopra, the movie is all set to release on 4th March, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu