Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజా సజ్జా కాంబినేషన్‌లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా రూపుదిద్దుకొన్న హనుమాన్ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ సినిమా అన్ని భాషల్లో అన్ని వర్గాలను ఆకట్టుకొని రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. అలాంటి గొప్ప విజయం సాధించిన ఈ చిత్రం ఇటీవల 100 రోజుల పండుగను జరుపుకొన్నది. ఈ సందర్భంగా జై హనుమాన్ పొస్టర్‌ను రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
హనుమాన్ సినిమా భారీ విజయం తర్వాత దానికి సీక్వెల్‌గా మళ్లీ మరో పాన్ ఇండియా మూవీ జై హనుమాన్‌ను సిద్దం చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా హనుమాన్‌కు సీక్వెల్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే.

అయితే హనుమాన్ సినిమాతో అంచనాలు పెరిగిపోవడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు, అంచనాలకు భిన్నంగా ఉండేందుకు ఈ సినిమాను ఉన్నత సాంకేతికతో ఐమాక్స్ 3డీ వెర్షన్‌లో తీర్చి దిద్దుతున్నారు. ఈ వెర్షన్ ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నారు.
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీన జై హనుమాన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఓగబ్బిలం కోరల అంచున హనుమంతుడు చేతిలో గదతో సాక్షాత్కరించారు. అయితే ఈ పోస్టర్‌లో డ్రాగన్ మాదిరిగా ఉండే ఓ భయంకర పక్షిని పరిచయం చేసి.. పిల్లలకు కొత్త అనుభూతి ఉండబోతుందనే ఫీల్‌ను కల్పించారు.

హనుమాన్‌కు మంచి సాంకేతికత, వీఎఫ్ఎక్స్‌తో జై హనుమాన్ సినిమాను రెడీ చేస్తున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాత అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో 100 రోజుల పండుగను హనుమాన్ జయంతి రోజున సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఈ సినిమాను మీడియా ఫ్యామిలీకి ప్రదర్శంచేందుకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











