twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈరోస్ సంస్థ ప్రకటనక: నెగెటివ్ టాక్‌లో కలెక్షన్లు కేక

    By Bojja Kumar
    |

    ముంబై: సల్మాన్ ఖాన్ 'జై హో' చిత్రం తొలి రోజు నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నెగెటివ్ టాక్ లోనూ కలెక్షన్లు మాత్రం బాగానే సాధించింది. జనవరి 24న విడుదలైన ఈచిత్రం సెకండ్ వీకెండ్ పూర్తయ్యే నాటికి రూ. 166.33 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల వివరాలను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ స్వయంగా ప్రకటించింది.

    2014 సంవత్సరంలో 100 కోట్ల మార్కు దాటిన తొలి చిత్రం 'జై హో' తమ జై హో చిత్రమే అని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 5000లకు పైగా థియేటర్లలో విడుదలైన ఈచిత్రం ఇండియాలో రూ. 133.33 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ. 102.58 కోట్లు నెట్ కలెక్షన్. యూఎస్, ఓవర్సీస్ బాక్సాఫీసువద్ద రూ. 33 కోట్లు వసూలు చేసింది.

    రూ. 75 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈచిత్రం దాదాపు 5వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేసారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమా ఇంత గ్రాండ్ రిలీజ్ అయిందంటే ఓపెనింగ్ డే కలెక్షన్లు కేక పుట్టిస్తాయని అంతా ఊహించారు. పలు రికార్డులను తిరగరాయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే 'జై హో' చిత్రం ఎవరి అంచనాలను అందుకోలేక పోయింది. తొలి రోజు ఈచిత్రం ఇండియా వ్యాప్తంగా కేవలం రూ. 17.55 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంత గ్రాండ్‌గా విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం తొలి రోజు వసూలు చేసిన మొత్తం చాలా తక్కువ అని, అదే విధంగా ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించలేదని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

    2012లో విడుదలైన సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్' చిత్రం తొలి రోజు ఏకంగా రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆ రేంజిలో కాక పోయినా కనీసం 25 కోట్లయినా వసూలు చేస్తుందని అంతా భావించారు. కానీ 'జై హో' చిత్రం అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ తక్కువ వసూళ్లు సాధించింది.

    చిరంజీవి తెలుగులో నటించిన 'స్టాలిన్' చిత్రానికి ఇది రీమేక్ కావడంతో ఏపీలో విడుదలయ్యే హిందీ వెర్షన్‌కు మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. జై హో చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్‌తో తెరెక్కింది. ఈచిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన డైసీ షా నటించింది.

    English summary
    Salman Khans latest Jai Ho, has earned Rs 166.33 crore upto its second weekend at the Box Office worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X