సల్మాన్ ‘జై మో’ రికార్డులేవీ సృష్టించలేదు
ముంబై: సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'జై హో' చిత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. రూ. 75 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈచిత్రం దాదాపు 5వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేసారు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమా ఇంత గ్రాండ్ రిలీజ్ అయిందంటే ఓపెనింగ్ డే కలెక్షన్లు కేక పుట్టిస్తాయని అంతా ఊహించారు. పలు రికార్డులను తిరగరాయడం ఖాయమని అంతా అనుకున్నారు.
అయితే 'జై హో' చిత్రం ఎవరి అంచనాలను అందుకోలేక పోయింది. తొలి రోజు ఈచిత్రం ఇండియా వ్యాప్తంగా కేవలం రూ. 17.55 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంత గ్రాండ్‌గా విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం తొలి రోజు వసూలు చేసిన మొత్తం చాలా తక్కువ అని, అదే విధంగా ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించలేదని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
2012లో విడుదలైన సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్' చిత్రం తొలి రోజు ఏకంగా రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఆ రేంజిలో కాక పోయినా కనీసం 25 కోట్లయినా వసూలు చేస్తుందని అంతా భావించారు. కానీ 'జై హో' చిత్రం అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ తక్కువ వసూళ్లు సాధించింది.
చిరంజీవి తెలుగులో నటించిన 'స్టాలిన్' చిత్రానికి ఇది రీమేక్ కావడంతో ఏపీలో విడుదలయ్యే హిందీ వెర్షన్‌కు మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. జై హో చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్‌తో తెరెక్కింది. ఈచిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన డైసీ షా నటించింది.


Click it and Unblock the Notifications












