‘జై లవ కుశ’ సెన్సార్ రిపోర్ట్: నిర్మొహమాటంగా పిల్లలతో వెళ్లొచ్చు!

జై లవ కుశ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ అయింది.

By Bojja Kumar

Recommended Video

"Jai Lava Kusa" Censor Reports ‘జై లవ కుశ’ సెన్సార్ రిపోర్ట్..

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 'జై' టీజర్ చూసినపుడు సినిమాలో కాస్త వయొలెన్స్ ఎక్కువ ఉందని అంతా భావించారు. అయితే U/A సర్టిఫికెట్ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రేటింగ్ వచ్చిందంటే పిల్లలను కూడా నిర్మొహమాటంగా సినిమాకు తీసుకెళ్లొచ్చన్నమాట.

అనసూహ్య స్పందన

ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో "జై లవ కుశ" చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను "జై లవ కుశ" ట్రైలర్ సంపాదించుకుంది.

నమ్మకంగా ఉన్న కళ్యాణ్ రామ్

నమ్మకంగా ఉన్న కళ్యాణ్ రామ్

"యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం" అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.

జై లవ కుశ

జై లవ కుశ

కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)

ట్రైలర్

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్

'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X