Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్‌కి వరం... నా అదృష్టం: ‘జై లవ కుశ’ డైరెక్టర్ బాబీ
‘జై లవ కుశ’ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ ప్రస్తుతం పూణె పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం 'జై లవ కుశ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ పూణెలో జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీస్తున్నాడని పొగడ్తలు గుప్పిస్తూ బాబీ చేసిన ట్వీట్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెంచేలా చేసింది.
నమ్మశక్యంకాని అనుభవం
ఎన్టీఆర్ మన కళ్ల ముందు డ్యాన్స్ చేస్తుంటే చూడటం నమ్మశక్యం కాని అనుభం..... అంటూ తాను ఎన్టీఆర్ డాన్స్‌కు వీరాభిమానిని అనే విషయం చెప్పకనే చెప్పారు బాబీ.
అతడికి వరం
పుట్టుకతోనే కొందరికి కొన్ని లక్షణాలు అబ్బుతాయి. అది వారసత్వమో? లేక మరేమైనా అనుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు నటన, డాన్స్‌కు రెండూ వారసత్వంగా అబ్బాయి. ఈ విషయాన్ని బాబీ ప్రస్తావిస్తూ.... ఆ ప్రతిభ అతడికి ఒక వరం, తారక్ డాన్స్ చేస్తుండగా నేరుగా చూడటం నా అదృష్టం అంటూ బాబీ ట్వీట్ చేశాడు.
నట విశ్వరూపమే
ఇప్పటికే విడుదలైన ‘జై' టీజర్ ద్వారా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటవిశ్వరూపం చూపించబోతున్నారనే విషయం అభిమానులకు అర్థమైంది. బాబీ ట్వీట్ ద్వారా సినిమాలో కనువిందు చేసే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు ఫ్యాన్స్.
త్రిపాత్రాభినయం
‘జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ‘జై' అనే పాత్ర రావణుడిలా విలనిజాన్ని పోలి ఉంటుందని ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. లవ, కుశ పాత్రలను పరిచయం చేస్తూ త్వరలో మరిన్ని టీజర్లు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.