పవన్ ప్లాఫ్ సినిమాను అధిగమించని జై లవకుశ.. టికెట్ కొంటే మరొకటి ఉచితం..
తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం భారీ కలెక్షన్లను కురిపిస్తున్నది. తొలి రోజు కలెక్షన్లు ఎన్టీఆర్ స్టామినాను తెలియచెప్పుతున్నది. అన్నదమ్ముల మధ్య బంధాలు, అనుబంధాల
తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం భారీ కలెక్షన్లను కురిపిస్తున్నది. తొలి రోజు కలెక్షన్లు ఎన్టీఆర్ స్టామినాను తెలియచెప్పుతున్నది. అన్నదమ్ముల మధ్య బంధాలు, అనుబంధాలు సెంటిమెంట్‌ను పండించాయి. ఎన్టీఆర్ నటన ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. రాశీఖన్నా, నివేదా థామస్ గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. స్వింగ్ జరా అంటూ స్టెప్పెసిన తమన్నా ఐటెం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో బ్రహ్మరథం పడుతున్నారు.

ఒక మిలియన్ దిశగా..
అమెరికాలో కలెక్షన్ల పరంగా జై లవకుశ దుమ్ము దులుపుతున్నది. త్వరలోనే ఒక మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకొనే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం అనే స్కీమ్ బాగా కలిసి వచ్చినట్టు తెలుస్తున్నది. దాంతో ఒక మిలియన్ డాలర్ల మార్క్ సులభమైందనే మాట వినిపిస్తున్నది.

తొలిరోజున యూఎస్‌లో
తొలిరోజున జై లవకుశ చిత్రం $589,000 వసూళ్లను సాధించడం గమనార్హం. గతంలో జనతా గ్యారేజ్ చిత్రం వసూళు చేసిన కలెక్షన్లను జై లవకుశ అధిగమించింది. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం అనే స్కీమ్‌తో ఇది సాధ్యమైందనే వాదన మొదలైంది.

పవన్ రికార్డుకు దూరంగా
అయితే దారుణమైన ఫ్లాప్ అని పేరు మూటగట్టుకొన్న సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర వసూళ్లను అధిగమించకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. తొలి రోజు వసూళ్లు, ప్రీమియర్లు పరిగణనలోకి తీసుకొంటే ప్రస్తుతం జై లవకుశ ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జై లవకుశ, సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాలకు బాబీనే దర్శకుడు కావడం గమనార్హం.

బయర్ల గుండెల్లో రైళ్లు..
జై లవకుశ ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు అమ్ముకున్నట్టు సమాచారం. బయ్యర్ల పెట్టుబడి రావడానికి కనీసం 2 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందట. అయితే శుక్ర, శని, ఆదివారాల్లు వీకెండ్ కావడంతో జై లవకుశ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

టాప్ టెన్ చిత్రాలు ఇవే..
అమెరికాలో ఇప్పటివరకు తెలుగు సినిమాలు వసూలు చేసిన కలెక్షన్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. టాప్ 10 కలెక్షన్ల వివరాలు ఫిల్మీబీట్ రీడర్ల కోసం..
1. బాహుబలి-2 - 24, 50, 000 డాలర్లు
2. బాహుబలి - 13, 65, 000 డాలర్లు
3. ఖైదీ నెం.150 - 12, 95, 613 డాలర్లు
4. సర్దార్ గబ్బర్ సింగ్ - 6, 16, 000 డాలర్లు
5. జై లవకుశ - 5, 89, 000 డాలర్లు
6. జనతా గ్యారేజ్ - 5, 84, 000 డాలర్లు
7. బ్రహ్మోత్సవం - 5, 60, 000 డాలర్లు
8. శ్రీమంతుడు - 5, 36, 000 డాలర్లు
9. ఆగడు - 5, 24, 000 డాలర్లు
10. కాటమరాయుడు - 4, 60, 000 డాలర్లు

తెలుగు రాష్ట్రాల్లో హవా
జై లవకుశ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం తొలి రోజున 21. 40 కోట్లు వసూలు చేసింది. నైజాంలో రూ.5.05 కోట్లు, సీడెడ్‌లో రూ.3.77 కోట్లు, వైజాగ్‌లో 1.89 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.96, వెస్ట్‌లో 1.89 కోట్లు, కృష్ణాలో 1.71 కోట్లు, గుంటూరు రూ. 3.05 కోట్లు, నెల్లూరు రూ.1.08 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











