»   » ‘జై లవ కుశ’: ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్‌పై కొందరు ఇలా....

‘జై లవ కుశ’: ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్‌పై కొందరు ఇలా....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa Positives and Negatives ‘జై లవ కుశ’: ప్లస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' మూవీ గురువారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగా ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. విదేశాల్లో ఇప్పటికే చాలా చోట్ల ప్రీమయర్ షోలు, తెలుగు రాష్ట్రాల్లో బెనిపిట్ షోలు పడ్డాయి.

సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఇదో మంచి చిత్రం అవుతుందని అంటున్నారు. సినిమాలోని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్ల గురించి సినిమా చూసిన వారు రకరకాలుగా చెబుతున్నారు.

ఫస్ట్ 15 నిమిషాలు బోర్ కానీ...

ఫస్ట్ 15 నిమిషాలు బోర్ కానీ...

సినిమా చూసిన వారు రకరకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్ం చేస్తున్నారు. సినిమా మొదలైన ఫస్ట్ 15 నిమిషాలు కాస్త బోర్ అనిపిస్తుందని, ఆ తర్వాత సినిమాలో మంచి ఎంటర్టెన్మెంట్ మొదలవుతుందని అంటున్నారు.


సింహాద్రి స్టైల్

సింహాద్రి స్టైల్

సినిమాలో జై క్యారెక్టర్..... సింహాద్రి స్టైల్ క్యారెక్టరైజేషన్ మాదిరిగా ఉండి ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టెన్ చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్ం చేశారు.


అదుర్స్ లాగా

అదుర్స్ లాగా

సినిమాలోని కుశ క్యారెక్టరైజేషన్ అదుర్స్ సినిమా మాదిరి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుందని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.


డైలాగ్స్

డైలాగ్స్

సినిమాలో డైలాగ్స్ చాలా బావున్నాయని, సినిమాలోని ఎంటర్టెన్మెంట్ లో డైలాగ్స్ చాలా కీలకంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.సెకండాఫ్ లో పెద్దగా స్టోరీ ఏమీ లేదు

సెకండాఫ్ లో పెద్దగా స్టోరీ ఏమీ లేదు

జై సినిమాలో సెకండాఫ్ లో పెద్దగా స్టోరీ ఏమీ లేదని, మూడు క్యారెక్టర్ల ను కలిపే కాన్సెప్టులోనే సినిమా రన్ అవుతుందని అంటున్నారు.క్లైమాక్స్ సెంటిమెంట్

క్లైమాక్స్ సెంటిమెంట్

సినిమా క్లైమాక్స్ పార్ట్ ముగురు అన్నదమ్ముల సెంటిమెంటు డ్రామాతో ఎమోషనల్ గా సాగుతుందట... ఈ పార్ట్ మీద కొందరు పాజిటివ్ గా, కొందరు నెగెటివ్ గా స్పందించారు.


సినిమా పాటలు

సినిమా పాటలు

సినిమాలో రెండు పాటలు మాత్రమే స్కీన్ మీద చాలా బావున్నాయని, మిగతా పాటలు స్క్రీన్ మీద పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు. కొందరు మాత్రం పాటలు ఫర్వాలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు?

సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు?

సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు అనే ప్రశ్నకు... చాలా మంది నుండి వన్ టైమ్ వాచబుల్ మూవీ, అది కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ కోసమే అని అంటున్నారు.
English summary
Junior NTR's Jai Lava Kusa has been released on Thursday. Check out Jai Lava Kusa Positives and Negatives.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu