ఇక యుద్ధమే: సై అంటూ బరిలో దూకిన ఎన్టీఆర్... సిద్ధంగా మహేష్, బాలయ్య!
ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ కాబోతోంది.
హైదరాబాద్: రంజాన్ పండగ సందర్భంగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త చెప్పారు 'జై లవ కువ' మేకర్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అపుడు దసరా సీజన్ కావడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని, పిల్లలకు హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని నిర్మాతలు సెప్టెంబర్ 21 డేట్ ఫిక్స్ చేశారు.

బాక్సాఫీసు యుద్ధమే
అయితే ఇదే దసరా సీజన్లో మహేష్ బాబు, బాలయ్య సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీనే మహేష్ బాబు ‘స్పైడర్' రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సెప్టెంబర్ 28న బాలయ్య ‘పైసా వసూల్' రాబోతున్నట్లు టాక్. అదే జరిగితే బాక్సాఫీసు వద్ద రసవత్తరమైన పోరు తప్పదు.

డిఫరెంటుగా ట్రై చేస్తున్న ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఓ పాత్ర విలన్ లక్షణాలతో ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇదో డిపరెంట్ మూవీ. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నో కాంప్రమైజింగ్
కెస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. తమ్ముడి సినిమా కావడంతో కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాడవం లేదు. సినిమాలోని ఓ పాత్ర కోసం విదేశీ మేకప్ నిపుణులను కూడా పిలిపించారు.

హైప్ అదిరిపోద్ది
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై హైప్ మరింత పెరగనుంది.


Click it and Unblock the Notifications











