Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫుల్ క్లాస్: 'జై లవ కుశ'...... ‘లవ కుమార్’ ఫస్ట్‌లుక్
జై లవ కుశ... లవ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. లవ కుమార్ క్లాస్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవ కుశ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే 'జై' పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా లవ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 'జై' పాత్ర ఫుల్ మాస్ అయితే....... లవ కుమార్ పాత్ర ఫుల్ క్లాస్ గా ఉంటుందని స్పష్టమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
|
రాఖీ కానుకగా ఫస్ట్ లుక్
'రాఖీ' పండుగను పురస్కరించుకుని లవ కుమార్ ఫస్టు లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. త్వరలో కుశ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది.
కుశ పాత్ర ఎలా ఉంటుందో?
‘జై' పాత్ర మాస్, ‘లవ' పాత్ర క్లాస్..... మరి త్వరలో విడుదల కాబోతున్న ‘కుశ' పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ పాత్రలో ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారో? అంటూ చర్చించుకుంటున్నారు.
Recommended Video
రాముడు రావణుడైతే....
జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజైన 'జై టీజర్' పలు సంచలనాలు నమోదు చేసింది. రాముడు లాంటి ఎన్టీఆర్ రావణుడి తరహాలో విలన్ పాత్ర పోషించడంతో అంతా షాకయ్యారు.
సౌండియా రికార్డ్
ముడు లాంటి జూ ఎన్టీఆర్ రావణుడిగా మారితే తన విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన ‘జై' టీజర్‌కు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. సౌతిండియాలో ఫాస్టెస్ట్ 7.8 మిలియన్ వ్యూస్ సాధించి సౌతిండియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.