రావణ.. రామ లక్ష్మణులు : ‘జై లవ కుశ’ ట్రైలర్ అదుర్స్
ఎన్టీఆర్ మూవీ ‘జై లవ కుశ’ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాల పెరిగాయి.
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి.
ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.

విలన్ పాత్రలో జై
ఎన్టీఆర్ ఈ చిత్రంలో జై, లవ కుమార్, కుశ అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇందులో జై పాత్ర రావణుడి తరహా క్యారెక్టరైజేషన్ తో ఉంటుంది.

జై వర్సెస్ లవ, కుశ
జై మూలంగా లవ కుమార్, కుశ ఇబ్బందులు పడతారని, ఈ క్రమంలో కథ రసవత్తరంగా సాగుతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

తమ్ముళ్లంటే పగ
జై... తన ఇద్దరు తమ్ముళ్లంటే పగతో రగలిపోయే పాత్రలో కనిపించబోతున్నాడు. మనం అనేది అబద్దం... నేను అనేదే నిజం అనే తరహాలో జై ప్రవర్తన ఉండబోతోంది.

ఎన్టీఆర్
ఇప్పటి వరకు అభిమానులు చూడని విధంగా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో అభిమానులను అలరించబోతున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ చిత్రం ది బెస్ట్ మూవీగా నిలవబోతోంది.
ట్రైలర్
‘జై లవ కుశ' ట్రైలర్ ఇదే. మీరూ ఓ లక్కేయండి. సెప్టెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











