జూనియర్ ఎన్టీఆర్ దారిలో బాలయ్య.. నందమూరి సెంటిమెంట్ ఇదే..

By Rajababu

Recommended Video

జూనియర్ ఎన్టీఆర్ దారిలో బాలయ్య..

సినిమా పరిశ్రమలో మూఢ నమ్మకాలకు, జాతకాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఒక పేరుతో సినిమా హిట్ అయితే అదే పేరు వచ్చేలా సినిమా టైటిల్స్ పెట్టుకొనే ఒక ఆచారం మనకు కనిపిస్తుంటుంది. మొనగాడుతో సినిమా హిట్ అయితే భలే మొనగాడు.. ఆ మొనగాడు.. ఈ మొనగాడు అనే పేర్లతో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో జై టైటిల్‌పై ఆసక్తికరంగా చర్చ జరుగుతున్నది..

 కలిసి వచ్చిన జై టైటిల్

కలిసి వచ్చిన జై టైటిల్

ఇప్పుడు నందమూరి వారసులకు అదృష్టంగా కనబడుతున్న టైటిల్ ‘జై'. ఈ పదం ఇప్పడు వారికి సక్సెస్‌కు అడ్డగా మారినట్టు కనిపిస్తున్నది. గతంలో కూడా జయ అనే పదం సీనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలమైన ఫలితాలను ఇచ్చింది.

 ఎన్టీఆర్ జై లవకుశతో

ఎన్టీఆర్ జై లవకుశతో

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడు రకాల పాత్రలు పోషించి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించాడు. అందులో జై పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

 రావణ పాత్రతో ఎన్టీఆర్

రావణ పాత్రతో ఎన్టీఆర్

తెర మీద జై పాత్ర బ్రహ్మండంగా పేలడంతో భారీగా కలెక్షన్ల వరద కూడా పారింది. ప్రతినాయకుడి ఛాయలు ఉన్న రావణ పాత్రను ప్రేక్షకులు ఆదరించారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా జై లవకుశ ఓ ఘనతను సాధించింది.

జై సింహతో బాలకృష్ణ

జై సింహతో బాలకృష్ణ

జై లవకుశ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమా జై సింహ. ఇందులో ఎన్టీఆర్ జూనియర్ బాబాయ్ బాలకృష్ణ టైటిల్ రోల్‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణది కూడా ఓ రకంగా ప్రతినాయకుడి ఛాయలు ఉన్న పాత్రగా కనిపిస్తున్నది.

 జై సింహ ట్రైలర్ చూస్తే..

జై సింహ ట్రైలర్ చూస్తే..

నవంబర్ 1 తేదీన విడుదలైన జై సింహ ట్రైలర్ చూస్తే.. దాన వీర శూర కర్ణ అంటూ డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. జై లవకుశలో మాదిరిగానే, జై సింహ చిత్రంలో పొలిటికల్ టచ్ ఉండటం ఆసక్తిని రేపుతున్నది. జై లవకుశలో అబ్బాయి పురాణాల్లోని రావణుడిని పేరును వాడుకొంటే బాబాయి ఇప్పుడు కర్ణుడు.. నరసింహుడు అంటూ మోషన్ ట్రైలర్‌లో అల్లాడించాడు.

జై సింహ ట్రెండింగ్‌గా

తాజాగా వచ్చిన జై సింహ మోషన్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తొలి గంటలోనే ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. బాలయ్య గెటప్‌కు మంచి క్రేజ్ కనిపించింది.

జై టైటిల్‌కు రైట్ రైట్

జై టైటిల్‌కు రైట్ రైట్

ఈ బాబాయి, అబ్బాయిల జై టైటిల్ కథను ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. జై సింహ రిలీజ్ అయితే గానీ అందులో ఉండే పాత్ర స్వరూపం ఏంటో తెలియదు. కానీ జై సింహ చిత్రం ఓ విభిన్నమైన కథతో రూపొందుతున్నదని ప్రచారం జరుగుతున్నది. ఇక బాలయ్యకు జై టైటిల్ కలిసి వస్తుందా లేదా అనే విషయం కోసం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X