‘జై సింహ’కు ఏపీలో 24 గంటలు అనుమతులు.... ఇక బాలయ్య ప్రభంజనమే!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'జై సింహ' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.
Recommended Video


ఏపీలో 24 గంటల అనుమతులు
గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య సినిమాకు 24 గంటలు షోలు వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్ర్యతేక అనుమతులు ఇచ్చారు.

అదనంగా రెండు మూడు షోలు
సాధారణంగా రోజూ 4 ఆటలు వేస్తారు. ప్రత్యేక అనుమతులు వచ్చిన నేపథ్యంలో రాత్రి 1 గంట నుండి ఉదయం 10 గంటల వరకు మరో రెండు మూడు షోలు పడే అవకాశం ఉంది. స్పెషల్ షోల ద్వారా కలెక్షన్లు ఎక్కువ రాబోతున్నాయి.

బాలయ్య ప్రభంజనమే
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం భారీగా ఉంటుందనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తం అవుతున్నాయి.

బ్రహ్మానందం కామెడీ
ఇక సినిమాలో బ్రహ్మానందం కామెడీ కూడా హైలెట్ కానుంది. బాలయ్య, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయం అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

కీలకంగా ప్రకాష్ రాజ్
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. హీరో హీరోయిన్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఆయనదే. సినిమాలో ఆయన పాత్ర కీలకమైన మలుపుకు కారణం అవ్వనుంది.

జై సింహ
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు, తెర వెనక
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.


Click it and Unblock the Notifications











