జై సింహా జోష్.. ఎడ్లబండిపై ఊరేగిన బాలయ్య
సంక్రాంతి పండుగను నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొంటున్నారు. జై సింహ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్ననేపథ్యంలో బాలయ్య పండుగ జోష్ మరింత పెరిగింది.
సంక్రాంతి పండుగను నందమూరి నటసింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొంటున్నారు. జై సింహ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతున్ననేపథ్యంలో బాలయ్య పండుగ జోష్ మరింత పెరిగింది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో బాలయ్య కుటుంబం సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నది. బాలయ్య సంక్రాంతి జోష్ సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.

నారావారిపల్లెలో బాలకృష్ణ
సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు బాలకృష్ణ నారావారిపల్లెలో పర్యటించారు. ఊరంతా ఎడ్లబండిలో తిరుగుతూ బాలయ్య సందడి చేశాడు.
Recommended Video


ఎడ్లబండిపై బాలకృష్ణ
నారావారి పల్లలో ఎడ్లబండిపై ఊరేగుతున్న బాలకృష్ణ. బాలకృష్ణ సంప్రదాయక దుస్తుల్లో దర్శనిమిచ్చారు. బాలయ్యను చూడటానికి అభిమానులు పోటేత్తారు.

పిల్లలతో కలిసి బాలకృష్ణ
జోడెడ్ల బండిలో పిల్లలతో కలిసి ఉత్సాహంగా బాలకృష్ణ

బాలయ్య శ్రీవారి దర్శనం
చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొన్న దృశ్యం.

ఏనుగు తొండంతో ఆశీర్వాదం
శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఏనుగు తొండంతో ఆశీర్వాదం తీసుకొంటున్న బాలయ్య.


Click it and Unblock the Notifications











