‘‘మౌనంగా బాధల్ని భరిస్తా, మూర్ఖంగా ప్రాణాలు తీస్తా’’... అదరగొట్టిన బాలయ్య!

By Bojja Kumar

Recommended Video

'జై సింహ' ట్రైలర్.. బాలయ్య అదరగొట్టాడుగా !

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహా' ప్రీ రిలీజ్ వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

బాలయ్య స్టైల్ అదిరింది

బాలయ్య స్టైల్ అదిరింది

బాలయ్య గత సినిమాల కంటే స్టైలిష్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో నయనతార, బాలయ్య కాంబినేషన్లో వచ్చే సీన్లు అదిరిపోయేలా ఉంటాయని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

డాన్స్ పెర్ఫార్మెన్స్

డాన్స్ పెర్ఫార్మెన్స్

ఇప్పటి వరకు టాలీవుడ్లో బాగా డాన్స్ చేసే హీరోలంటే బన్నీ, రామ్ చరణ్ లాంటివారే. అయితే వారికి ఏ మాత్రం తీసిపోకుండా బాలయ్య డాన్స్ చేశారని ఇటీవల నిర్మాత వెల్లడించారు. తాజాగా ట్రైలర్లోని కొన్నిషాట్లు చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

బ్రహ్మానందం కామెడీ

బ్రహ్మానందం కామెడీ

ఇక సినిమాలో బ్రహ్మానందం కామెడీ కూడా హైలెట్ కానుంది. బాలయ్య, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయం అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

కీలకంగా ప్రకాష్ రాజ్

కీలకంగా ప్రకాష్ రాజ్

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. హీరో హీరోయిన్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఆయనదే. సినిమాలో ఆయన పాత్ర కీలకమైన మలుపుకు కారణం అవ్వనుంది.

జై సింహ

జై సింహ

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

టీనటులు, తెర వెనక

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X