నయనతార, 40 డాన్సర్లతో బాలయ్య కిర్రాక్.. దుబాయ్‌లో జై సింహ హల్‌చల్
సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న నందమూరి బాలకృష్ణ చిత్రం జై సింహ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. బాలయ్య కెరీర్‌లో 102వ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాకు దర్శకుడు కేఎస్ రవికుమార్. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో జై సింహ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను నిర్మాత సీ కల్యాణ్ మీడియాకు రిలీజ్ చేశారు.

జై సింహ షూటింగ్ పూర్తి
జై సింహ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్‌లో పూర్తి అయింది. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, నయనతారపై ఒకపాట, బాలయ్య, నటాషా దోషిపై మరోపాటను అత్యద్భుతంగా చిత్రీకరించినట్టు సినిమా యూనిట్ వెల్లడించింది.

బాలయ్య నటాషా దోషిపై పాట
బాలయ్య, నటాషా దోషిపై చిత్రీకరించిన పాటను కనివిని ఎరుగని రీతిలో చిత్రీకరించినట్టు యూనిట్ తెలిపింది. దాదాపు 30 మంది యూరోపియన్ డ్యాన్లర్లతో ఈ పాటను షూట్ చేశారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు.

బాలకృష్ణ, నయనతారపై సాంగ్
ఇక బాలకృష్ణ, నయనతారపై చిత్రీకరించిన పాటను సుమారు 20 మంది యూరోపియన్ డ్యాన్సర్లపై తీశారు. దుబాయ్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫిని అందించారు అని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.

ఫ్యాన్స్‌కు విందులాంటి సినిమా
జై సింహ అభిమానులకు పండుగపూట విందులాంటింది. బాలకృష్ణ నటన ఆడియెన్స్‌కు అద్భుతంగా వినోదాన్ని పంచుతుంది. దర్శకుడు కేఎస్ రవికుమార్ అద్భుతమైన కంటెంట్‌తో జై సింహను బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దాడు అని నిర్మాత సీ కల్యాణ్ భరోసాను అందించారు.

డిసెంబర్ చివర్లో ఆడియో
సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య సినిమా ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ చివరివారంలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానున్నది.

నటీనటులు, సాంకేతిక వర్గం
సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ, నయనతార, నటాషా దోషితోపాటు హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, జయప్రకాశ్ రెడ్డి, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు ఎం రత్నం, ఆర్ట్ డైరెక్టర్‌గా నారాయణరెడ్డి, ఫైట్స్‌ను అంబరీవ్, రామ్‌లక్ష్మణ్, వెంకట్, సినిమాటోగ్రఫీని రాంప్రసాద్, నిర్మాతగా సీ కల్యాణ్, దర్శకత్వం బాధ్యతలను కేఎస్ రవికుమార్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











