twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జైసింహా 10రోజుల కలెక్షన్ రిపోర్ట్: నష్టం నుంచి గట్టెక్కాలంటే ఇంకెంత రాబట్టాలి?..

    |

    Recommended Video

    జైసింహా 10రోజుల కలెక్షన్ రిపోర్ట్..!

    సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ 'జైసింహ' మిగతా వాటికంటే ముందంజలో ఉందనే చెప్పాలి. అయితే లాంగ్ రన్‌లో కలెక్షన్లు డౌన్ అయ్యాయనేది ట్రేడ్ టాక్. మొదటి వారం మంచి వసూళ్లను రాబట్టిన జైసింహా.. రెండోవారంలో కాస్త నెమ్మదించింది. ఇక మూడో వారంలోకి ఎంటరయ్యేసరికి ఆ జోరు మరింత తగ్గినట్లు తెలుస్తోంది.

    రూ.2కోట్ల షేర్:

    రూ.2కోట్ల షేర్:

    మూడోవారంలో బాలయ్య 'జైసింహా' కేవలం రూ.2కోట్ల షేర్ మాత్రమే సాధించినట్లు సమాచారం. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే.. మొత్తం రూ.25కోట్ల కలెక్షన్లతో సినిమా మంచి వసూళ్లే రాబట్టింది.

     ఆ ఎఫెక్ట్:

    ఆ ఎఫెక్ట్:

    'జైసింహా' హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సంక్రాంతి సెలవుల తర్వాత థియేటర్ల వద్ద సందడి తగ్గింది. వరుస సెలవుల్లో బాగానే కలెక్షన్లు రాబట్టినా.. ఆ తర్వాత క్రమంగా జోరు తగ్గింది. అయితే జైసింహాతో పాటు విడుదలైన మిగతా సినిమాలేవి పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడంతో.. ఈ సినిమా కలెక్షన్లపై నిర్మాతలు ఇంకా నమ్మకంగానే ఉన్నారట.

    ఆ సినిమాలతో పోటీ తట్టుకుంటుందా?:

    ఆ సినిమాలతో పోటీ తట్టుకుంటుందా?:

    వచ్చే రిపబ్లిక్ డే సెలవుతో పాటు శని,ఆదివారాల్లో మళ్లీ కలెక్షన్లు పుంజుకుంటాయని జైసింహా నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆచారి అమెరికా యాత్ర, భాగమతి సినిమాలు కూడా విడుదలవుతుండటం జైసింహా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తాయేమో అన్న అనుమానం మొదలైంది.

    ఇంకో రూ.2కోట్లు కలెక్ట్ చేస్తే

    ఇంకో రూ.2కోట్లు కలెక్ట్ చేస్తే

    ఏదేమైనా జైసింహాను థియేటర్ల నుంచి పూర్తిగా ఎత్తేసే పరిస్థితి లేదు. ఈలోగా మరో రెండు, మూడు కోట్ల వసూళ్లు సాధించినా డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారని అంటున్నారు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువే కలెక్షన్లు వస్తే నిర్మాతలకు మరింత సంతోషమే.

     ఏరియాల వారీగా కలెక్షన్స్..;

    ఏరియాల వారీగా కలెక్షన్స్..;

    సీడెడ్-5.4కోట్లు(షేర్)తో పాటు నైజాంలో రూ.4కోట్లు.. మొత్తంగా 13కోట్ల దాకా షేర్ సాధించినట్లు చెబుతున్నారు. ఓవర్ సీస్ లో మాత్రం కోటి మార్కును అందుకోలేకపోవడం గమనార్హం. అన్నీ కలిపి రూ.28కోట్లు దాకా బిజినెస్ చేసిన ఈ సినిమా మరో రూ.3కోట్లు బిజినెస్ చేస్తే ఇక నష్టాలనేవే ఉండవంటున్నారు. వీకెండ్‌కు తోడు రిపబ్లిక్ డే కూడా వస్తుండటంతో మూడు కోట్ల కలెక్షన్లు అసాధ్యమేమి కాకపోవచ్చు.

    English summary
    Sankranthi season has finally come to an end. All the four films made their way to the theatres but no single film could have registered a strong impression at the box office. While Agnyathavaasi has become a big disaster, the movie Jai Simha has got the decent hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X