అరుదైన గౌరవం దక్కించుకున్న ఎన్టీఆర్ చిత్రం.. తెలుగులో జైలవకుశ మాత్రమే!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా నటించిన చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ సినిమాలలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. దర్శకుడు బాబీ ఈ చిత్రంలో అన్నదమ్ముల అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించాడు. తాజగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. త్వరలో సౌత్ కొరియాలో జరగబోయే ఫిలిం ఫెస్టివల్ లో జైలవకుశ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

ఆరు సినిమాలు
త్వరలో సౌత్ కొరియాలో బౌచన్ ఇంటర్నేషనల్ ఫాంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఆరు ఇండియా చిత్రాలని ఎంపిక చేశారు. టైగర్ జిందా హై, మెర్సల్, ఇజ్రా. సీక్రెట్ సూపర్ స్టార్, మామ్, జైలవకుశ చిత్రాలు ఎంపిక కావడం విశేషం.

ఏకైక తెలుగు చిత్రం
తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రం జైలవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో మూడు వైవిధ్యాలు చూపిస్తూ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉంటుంది. నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అదుర్స్.

బెస్ట్ ఏషియా కేటగిరి
బెస్ట్ ఏషియా కేటగిరిలో ఈ చిత్రాలు ఎంపికయ్యాయి. జులై 21, 22 తేదీల్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. దీనితో జైలవకుశ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అన్నదమ్ముల కథ
జైలవకుశ చిత్రం అన్నదమ్ముల మధ్య జరిగే అందమైన కథగా సాగుతుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











