Jailer twitter Review రజనీకాంత్ కమ్ బ్యాక్ మూవీ.. సెకండాఫ్, క్లైమాక్స్ ట్టిస్ట్ అదిరిపోయిందంటూ..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం ఆగస్టు 15 కానుకగా రిలీజైంది. ఓవర్సీస్, తమిళనాడులో ప్రత్యేక షోలు మొదలయ్యాయి. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ పెరిగింది. తమన్నా గ్లామర్, రజనీకాంత్ వింటేజ్ లుక్‌ వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇలాంటి అంచనాల మధ్య ఓవర్సీస్‌లో టాక్ ఎలా ఉందంటే?

జైలర్ పూర్తిస్థాయి వినోద చిత్రం. ఫస్టాఫ్‌లో యోగిబాబు, తలైవర్ కాంబో సూపర్‌గా ఉంది. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్‌లో తలైవర్ ఇరుగదీశాడు. సెకండాఫ్‌లో కొందరు స్పెషల్ ఎంట్రీలతో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్‌లో మేజర్ ట్విస్ట్ ఉంది. జైలర్ మిమ్మల్ని నిరాశపరచదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

జైలర్ పూర్తిస్థాయి వినోద చిత్రం. ఫస్టాఫ్‌లో యోగిబాబు, తలైవర్ కాంబో సూపర్‌గా ఉంది. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్‌లో తలైవర్ ఇరుగదీశాడు. సెకండాఫ్‌లో కొందరు స్పెషల్ ఎంట్రీలతో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్‌లో మేజర్ ట్విస్ట్ ఉంది. జైలర్ మిమ్మల్ని నిరాశపరచదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ ఒక్కరే. మళ్లీ తన సింహాసనం సొంతం చేసుకొన్నాడు. జైలర్ అదిరిపోయేలా ఉంది ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్. సినిమాలో సన్నివేశాలు గూస్‌బంప్స్ తెస్తాయి. నెల్సన్ మంచి సినిమా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

జైలర్ దివ్య దర్శనం జరిగింది. జైలర్ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. రాబోయేది జైలర్ వీక్. బాక్సాఫీస్ సునామీ అంటే ఏమిటో చూస్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

జైలర్ మూవీలో తలైవర్ స్టైల్ అదిరిపోతుంది. ప్రపంచమంతా ఒకే థియేటర్‌గా మారిపోతుంది. తలైవర్ ఫ్యాన్స్ ఈ రోజు స్టార్స్‌గా మారిపోతారు. జైలర్ లాంటి గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Jailer twitter Review

జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభమైంది. బెంగళూరులో సినిమా ప్రారంభమై.. రజనీకాంత్ పేరు తెరపైన పడగానే అభిమానుల కేరింతలు, అరుపులు మిన్నంటాయి. రజనీ మానియా అంటే ఏమిటో చూపించారు. ఇది కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా జైలర్ థియేటర్లలో అదే పరిస్థితి కనిపించింది.

జైలర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోను మంచి క్రేజ్ కనిపిస్తున్నది. కెనడాలో అభిమానులు థియేటర్లలో డ్యాన్సులు చేస్తూ కనిపించారు. రజనీకాంత్‌పై అభిమానానికి భాష, ప్రాంతం, రంగు మినహాయింపు అని అభిమానులు పలు ప్రాంతాల్లో చెప్పేందుకు ప్రయత్నించారు. కెనడాలోని అభిమానుల కోలాహలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

జైలర్ మానియా తమిళనాడులో ఎక్కువగా కనిపించింది. అభిమానుల్లో క్రేజ్, పిచ్చితనం, జోష్, ఉత్సాహం, ప్రేమ అణువణువునా కనిపించింది. ప్రతీ ప్రాంతంలో అభిమానులు రజనీపై ఎదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు. అందులో భాగంగా మీరు ఈ వీడియో చూడండి.

రజనీకాంత్‌ను అభిమానులు దేవుడిగా కొలుస్తారు. ఆయన సినిమా వచ్చిందంటే మొక్కులు తీర్చుకొంటారు. జైలర్ రిలీజ్ సమయంలో పలు చోట్ల పాలాభిషేకాలు, పూజలు తీశారు. అంతేకాకుండా రజనీ పటాలకు నమస్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ఓ ప్రాంతంలో జైలర్ రిలీజైన సినిమా థియేటర్‌ వద్ద రజనీకాంత్‌కు గుమ్మడికాయతో దిష్టి తీస్తూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.

జైలర్ సినిమా చూస్తూ నెల్సన్ దర్శకత్వంపై ఓ అభిమాని అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఈ సినిమాలోని పిల్లి, టైగర్ కాన్సెప్ట్‌ను సరిగా తీయలేదు అంటూ కామెంట్ పెట్టాడు. అయితే ఆ సినిమాలో ఏం జరిగిందో అనే ఆసక్తిని నెటిజన్ క్రియేట్ చేశాడు. అభిమానుల తమ హీరోపై ఇలా అభిమానాన్ని చాటుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X