»   »  ఇండియన్ సినిమాలో జాకీచాన్!

ఇండియన్ సినిమాలో జాకీచాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jackie Chan
యాక్షన్ కామిడీలను తనదైన శైలిలో రూపొందించి నవ్వులు పండించే జాకీచాన్ ఇప్పుడో ఇండియన్ సినిమాలో పనిచేయనున్నారు. మళయాళంలో నిర్మిత మవుతున్న Nair San అనే సినిమాలో ఆయన గెస్ట్ రోల్ లో కనపడనున్నారు. కథ ప్రకారం అయ్యప్పన్ పిళ్ళై మాధవన్ నాయర్ బ్రిటీష్ వాళ్ళని ఎదిరించటానికి కేరళ నుండి చైనాకు వలస వెళ్తాడు. అక్కడ మన జాకీచాన్ పరిచయమవుతాడు.

అయితే ఆయన పాత్ర కథను మలుపు తిప్పే కీలకమైన సన్నివేశాలలో కనపడుతుందంటున్నారు. ఇక మోహన్ లాల్ నాయర్ గా ప్రధాన పాత్ర పోషించనున్నారు. దాదాపు నలభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆల్బర్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే ఈ చిత్రం ఇండియా,చైనా,మంగోలియా,జపాన్ లలో షూటింగ్ జరుపుకోనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X