వివి వినాయక్‌కు షాక్ ఇచ్చిన రాజమౌళి!
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ముందుగా చెప్పుకునే పేర్లు రాజమౌళి, వివి వినాయక్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల. ఒకరిని మించి ఒకరు హిట్ సినిమాలు తీయాలని పోటీ పడుతూనే ఉంటారు. ప్రస్తుతం అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి నెం.1 పొజిషన్లో ఉన్నారు. తనకంటే ఓ అడుగు ముందు వేయాలనుకున్న వినాయక్‌కు తన స్టేట్‌మెంట్‌తో రాజమౌళి షాక్ ఇచ్చాడు.
వివి వినాయక్ సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'దాన వీర శూర కర్ణ' రీమేక్ ప్లాన్లో ఉన్నారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం తన జీవితంలోనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు వినాయక్. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమౌళి మరో ప్రకటన చేశారు. 'మహాభారత'ను తన స్టయిల్‌లో రీమేక్ చేయాలనేది ఆయన ప్రకటన వెనక ఉన్న సారాంశం.
ఈ రెండు చిత్రాలు పౌరాణిక సినిమాలే అయినందున సాధారణంగా రాజమౌళి తీయబోయే సినిమాపై జనాల్లో ఎక్కువ అంచనాలుంటాయి. పైగా పౌరాణికంపై రాజమౌళికి మంచి గ్రిప్ ఉండటం, కీరవాణి లాంటి అనుభవం గల వారు రాజమౌళి టీంలో ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. ఈ విధంగా వినాయక్‌కు రాజమౌళి పోటీగా రావడం షాకిచ్చే అంశమే అని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.
ప్రస్తుతం వివి వినాయక్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని యూనివర్శల్ స్టూడియో బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











