పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ 90 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. ఒక సినిమా ఆడియో ఇంత పెద్ద మొత్తం ధర పలకడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఆడియో మార్కెట్ తీవ్రంగా దెబ్బ తిన్న ప్రస్తుతం తరుణంలో జల్సా ఆడియో హక్కులను అంత పెద్ద మొత్తం చెల్లించి సొంతం చేసుకోవడం విశేషమే. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ పై విశ్వాసం వల్లనే ఆడియోకు అంత ధర పలికినట్లు భావిస్తున్నారు. ఈ ఆల్బంలో బాగా సెహగల్ పాడిన పాట ఉంది. ఈ సినిమా మార్చి 28వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది.
Story first published: Tuesday, July 14, 2026, 7:35 [IST]