twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ క్లైమాక్స్ కు భారీ ఖర్చు!!!

    By Staff
    |

    పవన్ కళ్యాణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న జల్సా సినిమా భారీ బడ్జెట్ సినిమాగా నిర్మితమవుతోంది. ఈ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్ కోసమే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.2.5కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ సీన్ కోసం గచ్చిబౌలి స్టేడియంలో వేసిన సెట్ కు రూ.2.5కోట్లు అయినట్టు ఫిల్మ్ నగర్ భొగట్టా. ఈ సెట్ లో 20 రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఇందుకోసం స్టేడియం రెంట్ రోజుకు రూ.5లక్షలుట. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ క్లైమాక్స్ కోసం లైట్స్ ఖర్చు రోజుకు రూ.1లక్షట. ఈ సీన్ ఫైట్ సీన్ కాగా ఇందుకోసం ముంబై, చెన్నైలనుంచి ప్రత్యేకంగా ఫైట్ మాస్టర్లను రప్పిస్తున్నారు. ఈ సీన్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖరీదైనదిగా చెప్పుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X