ప్రకాష్ రాజ్ వలన ఆలస్యమవుతున్న "జల్సా"?

By Staff


ప్రకాష్ రాజ్ వలననే "అతిథి" సినిమా ఆలస్యమవుతుందని భావించిన ఆ చిత్రహీరో మహేష్ బాబు ఆయనను తొలగించి మురళీ శర్మతో సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరోమారు ప్రకాష్ రాజ్ ప్రవర్తన వలన మరో సినిమా నిర్మాణం కూడా ఆలస్యమవుతోంది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "జల్సా". ఆయన లేకుండా సినిమాను పూర్తిచేద్దామనుకుంటే టాలెంట్ ఉన్న నటుడాయే. అలాగని ఆయనను సినిమాలో పెట్టుకుంటే ఇబ్బందులు పెడుతున్నాడాయే.

ప్రకాష్ రాజ్ ఇలా ఎందుకు చేస్తున్నాడంటే ఆయన తన నిర్మాణ సంస్థ డ్యూయెట్ సంస్థ కార్యకలాపాలలో నిమగ్నమవుతున్నాడని తెలుస్తోంది. ఆయన తన సొంత దుకాణం పనిలో చెన్నయ్ లో తిష్టవేస్తుంటే ఇక్కడ తెలుగు సినిమావాళ్లు తల పట్టుకుంటున్నారు.

అతిథి సినిమా తరువాత అలాంటి ఇబ్బందిని ఎదుర్కుంటున్న సినిమా పవన్ కళ్యాణ్ సినిమా జల్సా. ఇందులో విలన్ గా చేస్తున్న ప్రకాష్ రాజ్ వలలనే జల్సా నిర్మాణం ఆలస్యమవుతోందని "జల్సా" చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రకాష్ రాజ్ తో ఇంకా కొన్ని ఫైట్ సీన్ లు షూట్ చేయాల్సిఉందట. ప్రకాష్ రాజ్ దొరుకుతాడో లేదో మరి.

More from Filmibeat

Read more about: prakash raj pavan kalyan jalsa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X