కరో కరో జరా జల్సా...!!!
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమా జల్సా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, బద్రి లాంటి సినిమాలు సంగీత పరంగా సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. జల్సా సినిమా కూడా సంగీత పరంగా సూపర్ హిట్ సినిమాగా నిలిపేందుకు పవన్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇందుకోసం ఈ సినిమాలో పాప్ గాయకుడు బాబ సెహగల్ తో పూర్తి పాటను పాడించారు. బాబా సెహగల్ పాట సారి గమ పద నిసా, కరో కరో జరా జల్సా సాగుతుందీ సినిమాలో. ఇంతకుముందు రిక్షావోడు సినిమాలో బాబా సెహగల్ పాట పాడాడు. జల్సా మరో విశేషం ఏమంటే సంగీత దర్శకత్వం వహిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ టైటిల్ సాంగ్లో నర్తిస్తున్నాడు. జస్ట్ లైక్ శంకర్ దాదా సినిమాలో లాగా అన్నమాట.


Click it and Unblock the Notifications











