సొంతంగానే జల్సా విడుదల???
పవన్ కళ్యాణ్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ రూపొందిస్తున్న చిత్రం జల్సా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా అనుకున్నట్టు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ పనిని వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను సొంతంగా విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ అభిలషిస్తున్నట్టు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ రికార్డు స్థాయిలో సినిమాను కొనడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పేరు బయటపెట్టలేదు కానీ ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ జల్సాకు రూ.25 కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చింది. సినిమా ఇంకా షూటింగ్ ను జరుకుంటుండడం వలన ఎలాగూ విడుదలకు చాలా సమయమే ఉంది. ఈ సమయమే పవన్ కళ్యాణ్ ను ఇలా ఆలోచింపజేసినట్టు తెలుస్తోంది. జల్సా సినిమా ఘనవిజయం సాధించడం ఖాయమనే నమ్మకం కూడా కలగడమే పవన్ ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని మరో సమాచారం. జల్సా సినిమాలో పవన్ సరసన ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











