twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జంబ లకిడి పంబ’ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?

    By Bojja Kumar
    |

    1992లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నరేష్, ఆమని ప్రధాన పాత్రల్లో వచ్చిన 'జంబ లకిడి పంబ' పెద్ద కామెడీ హిట్. అప్పట్లో ఈ సినిమా ఐడియానే ఓ సెన్సేషన్. అలాంటి కాన్సెప్టుతోనే తాజాగా శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో మరో 'జంబ లకిడి పంబ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    Recommended Video

    Jamba Lakidi Pamba Hero Srinivas Reddy Press Meet

    శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి. ఎన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 22న గ్రాండ్‌గా విడుదలైంది.

    ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?

    ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది?

    ఆడియన్స్ నుండి.... సినిమా ఆశించిన స్థాయిలో లేదని, యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది. కామెడీ సీన్లు ఎక్కువగా పేలలేదని, అక్కడక్కడ మాత్రమే నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే శ్రీనివాసరెడ్డి పెర్ఫార్మెన్స్‌ బావుందనే టాక్ వినిపిస్తోంది.

     స్టోరీ లైన్ ఏమిటంటే...

    స్టోరీ లైన్ ఏమిటంటే...

    కథ విషయానికొస్తే వరుణ్ (శ్రీనివాస రెడ్డి) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పల్లవి (సిద్ధి ఇద్నాని) ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో నటించింది. ఈ దంపతుల మధ్య విబేధాలు రావడంతో లాయర్‌(పోసాని కృష్ణమురళి)ని ఆశ్రయిస్తారు. అయితే పోసాని మరణంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆత్మగా మారిన పోసాని వరుణ్-పల్లవిలను కలపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడిని ఆమెగా, ఆమెను అతడిగా మార్చేస్తాడు. ఇద్దరి కలిపే క్రమంలో కామెడీ పండించే ప్రయత్నం చేశారు.

    శ్రీనివాసరెడ్డి బాడీ లాంగ్వేజ్ సూపర్

    శ్రీనివాసరెడ్డి బాడీ లాంగ్వేజ్ సూపర్

    లేడీ క్యారెక్టర్లో శ్రీనివాసరెడ్డి నటన, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకునే విధంగా ఉందని, అయితే సీన్లు మరింత బలంగా ఉంటే కామెడీ అదిరిపోయేదని అంటున్నారు. శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి ప్రధాన బలం అనే టాక్ వినిపిస్తోంది. వెన్నెల కిషోర్, పోసాని పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు.

    జంబ లకిడి పంబ

    జంబ లకిడి పంబ

    న‌టీన‌టులు:
    పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ ,స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

    సాంకేతిక నిపుణులు:
    సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

    English summary
    Srinivas Reddy, Siddhi Idnani starrer ‘Jamba Lakidi Pamba‘ Public talk is not good. Story based on a couple’s dispute and their divorce lawyer’s soul, this film farce hardly evokes any laughter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X