జంబలకిడి పంబ లిరికల్ వీడియో లాంచ్ చేసిన హీరోయిన్ రాశీ ఖన్నా!
గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా,'ఆనందో బ్రహ్మ' చిత్రాల్లో హీరోగా నటించి విజయాలు అందుకున్న ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఎంతో ఇష్టపడి హీరోగా నటిస్తోన్న చిత్రం 'జంబలకిడి పంబ '. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాట 'మదిలో ఉన్న ప్రేమ ' లిరికల్ వీడియోను ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

రాశీ ఖన్నా మాట్లాడుతూ
జంబలకిడి పంబ` టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది . 'మదిలో ఉన్న ప్రేమ ' పాట చాలా బాగుంది . గోపీసుందర్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం . శ్రీనివాస్ రెడ్డి కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి `` అని చెప్పారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ "గోపిసుందర్ మ్యూజిక్ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అవుతుంది . ఈ సినిమాలో కామెడీ ఎంత బావుంటుందో , పాటలు అంత బావుంటాయి " అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ
మా `జంబలకిడి పంబ` సినిమా లిరికల్ వీడియోను రాశీ ఖన్నా ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది.జూన్ 14 న చిత్రాన్ని విడుదల చేస్తాం `` అని చెప్పారు.

శ్రీనివాసరెడ్డి కేరక్టర్ చాలా బాగా కుదిరింది
``జంబలకిడి పంబ` ఎంత సూపర్‌హిట్ టైటిలో అందరికీ తెలిసిందే. మా చిత్ర కథకు కూడా చక్కగా సరిపోయే టైటిల్ అది. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి కేరక్టర్ చాలా బాగా కుదిరింది. ఆయన కెరీర్‌లో మరో కీలక చిత్రమవుతుంది`` అని అన్నారు.

నటీనటులు:
సత్యం రాజేశ్, ధన్‌రాజ్, షకలక శంకర్, హరి తేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్, జబర్దస్త్ ఫణి తదితరులు. సాంకేతిక నిపుణులు:సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్ ముత్యాల, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచన, దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ (మను), నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్., సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్.


Click it and Unblock the Notifications











