For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Avatar 2 Twitter Review: అవతార్ 2 కి అలాంటి టాక్.. అదొక్కటే బలహీనంగా, ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా?

  |

  అవతార్ అనే సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. 2009లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇప్పుడు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అవతార్ సీక్వెల్ మూవీ Avatar: The Way Of Water (Avatar 2) ఎట్టకేలకు విడుదల కానుంది. అవతార్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న అంటే ఇవాళ ఏకంగా 160 భాషల్లో విడుదల కాగా.. ఒక్క భారత్ లోనే 6 భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా రిలీజ్ కు ముందు అంతకుముందే అవతార 2 ప్రీమియర్ చూసిన పలువురు నెటిజన్ల రివ్యూ ఏంటో చూద్దామా.

  మరోసారి విజువల్ వండర్ గా..

  మరోసారి విజువల్ వండర్ గా..

  హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన అద్భుతమైన రంగుల ప్రపంచం అవతార్. 2009లో విడుదలైన ఈ మూవీని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. పండోరా గ్రహం చుట్టూ తిరిగే కథాంశంతో ఒక చక్కటి ప్రేమకథను అద్ది వెండితెరపై ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి విజువల్ వండర్ అవతార్ 2ను థియేటర్లలో వీక్షించేందుకు ప్రేక్షకులు, సినీ లవర్స్ రెడీ అవుతున్నారు.

  నెటిజన్ల రియాక్షన్..

  నెటిజన్ల రియాక్షన్..

  ఇప్పటికే విడుదైలన ట్రైలర్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా చాలా అందంగా.. ఇంప్రెసివ్ గా, విజువల్ వండర్ గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడటమే కాకుండా స్టార్ హీరోలు సైతం ట్వీట్స్ చేశారు. మొత్తంగా 3 గంటల 12 నిమిషాల 10 సెకన్ల రన్ టైమ్ ఉన్న అవతార్ 2 ఎంతో గ్రాండ్ గా డిసెంబర్ 16 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీమియర్స్ ను ఇప్పటికే అమెరికాతో పాటు పలు చోట్ల వేశారు. ఆ ప్రీమియర్స్ చూసిన పలువురి నెటిజన్ల స్పందన ఏంటో చూద్దాం.

  లీనమై చూసేలా చేసింది..

  "జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను మరో గ్రహం మీద తెరకెక్కించాడని నేను దాదాపుగా నమ్మేశాను. సినిమా అద్భుతంగా ఉంది. నిడివి ఎక్కువగా ఉన్నా.. నన్ను లీనమై చూసేలా చేసింది. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ లాగా ఈ సినిమా కూడా ఒక సినిమాటిక్ అద్భుతం. తప్పక చూడాల్సిన చిత్రం" అని ఒక నెటిజన్ ట్విటర్ లో రాసుకొచ్చారు.

  కాస్త బలహీనంగా ఉంది..

  "నేను ఇప్పటివరకు చూడని అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో ఉత్కంఠభరింతంగా, అందంగా ఈ Avatar: The Way Of Water ఉంది. నేను 3డీలో చూశాను. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా కథ కాస్త బలహీనంగా ఉంది. 3 గంటల నిడివి ఎక్కువైనట్లు అనిపించింది. కానీ, మొత్తంగా చూసుకుంటే చూడటానికి చాలా బాగుంది. ఇక చివరి గంట మాత్రం అత్యద్భుతంగా ఉంది" అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.

  యాక్షన్స్ అయితే సూపర్బ్..

  "ఇప్పుడే అవతార్ 2 చూశాను. చాలా అద్భుతంగా ఉంది. నేను ఇది విజువల్ వండర్ గా ఉంటుందని ఊహించాను. కానీ చాలా ఎమోషనల్ గా ఉంటుందని ఊహించలేకపోయాను. పాత్రలను సూక్షంగా, ప్రపంచాన్ని చాలా రిచ్ గా అనుకున్నదానికంటే బెటర్ గా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ అయితే సూపర్బ్ గా ఉన్నాయి" అని మరొక నెటిజన్ ట్వీట్ లో తెలిపారు.

  అందులో తప్పు లేదు..

  "Avatar: The Way Of Water (Avatar 2) సినిమా కచ్చితంగా చూడాల్సిన చిత్రం. జేమ్స్ కేమెరాన్ అహంకారంగా, గర్వంగా ఎలా ఉంటారో అందులో తప్పు ఏం లేదు. ఎంతో అందమైన ఈ సినిమాను చూసేందుకు 3డీ గ్లాస్ పెట్టుకుని వీక్షిస్తున్న నా కళ్లు సరిపోవట్లేదు" అని రాసుకొచ్చిన నెటిజన్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

  నిజమైన ప్రపంచంలోకి..

  "ఇలాంటి సినిమా చూపించినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా చూశాక నిజమైన ప్రపంచంలోకి వెళ్లాలని నాకు లేదు" అని ట్విటర్ లో రాసుకొచ్చిన ఓ నెటిజన్ 10కి 9.8 రేటింగ్ ఇచ్చారు.

  ఉత్కంఠభరితంగా యాక్షన్..

  "జేమ్స్ కేమెరాన్ ఇప్పుడు రెండు కాదు మూడు ఎవరు చిత్రీకరించని బెస్ట్ సీక్వెల్స్ ను రూపొందించారు. Avatar: The Way Of Water (Avatar 2) అద్భుతంగా ఉంది. ఎఫెక్ట్స్, యాక్షన్ ఉత్కంఠభరితంగా ఉన్నాయి. కానీ ఈసారి కథ మనసుకు చాలా హత్తుకుంటుంది. అది చాలా పర్సనల్ గా, సంక్లిష్టంగా, ఎమోషనల్ గా అద్భుతంగా ఉంది" అని మరొకరు చెప్పుకొచ్చారు.

  English summary
  Hollywood Legendary Director James Cameron Movie Avatar The Way Of Water Aka Avatar 2 Twitter Review And Says Story Is Little Week Than Avatar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X