twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్ కామెరాన్ మరో అద్భుతం.. .. అవతార్2 కోసం లేటేస్ట్ టెక్నాలజీ.. కళ్లు చెదిరే విధంగా..

    By Rajababu
    |

    Recommended Video

    జేమ్స్ కామెరాన్ మరో అద్భుతం.. అవతార్2 కోసం లేటేస్ట్ టెక్నాలజీ..! | Filmibeat Telugu

    టైటానిక్, అవతార్ లాంటి చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ మీద హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుతాలే సృష్టించాడు. మరోసారి అవతార్2, అవతార్3 చిత్రాలను వరుసగా తెరకెక్కిస్తూ మరో సెన్సేషన్‌కు మారుపేరుగా నిలుస్తున్నాడు. గతంలో ఎన్నడూలేని విధంగా జేమ్స్ అత్యున్నత టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గ్రాఫిక్స్‌నే కాకుండా కొత్తరకం సాంకేతికతను ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఇంతకీ కొత్త తరహా టెక్నాలజీ ఏమిటంటే..

     అవతార్ సీక్వెల్స్ కోసం టెక్నాలజీ

    అవతార్ సీక్వెల్స్ కోసం టెక్నాలజీ

    అవతార్2, అవతార్3 చిత్రాల కోసం అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు జేమ్స్ కామెరాన్. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో జేమ్స్ వివరించాడు. అండర్‌వాటర్‌ క్యాప్చర్‌ షూట్‌ను ఇప్పటికే ప్రారంభించాం. ఆరుగురు నటులతో కూడిన బృందంపై కోన్ని సీన్లు చిత్రీకరించాం అని జేమ్స్ వెల్లడించారు.

     నీటి అడుగుభాగాన షూటింగ్

    నీటి అడుగుభాగాన షూటింగ్

    ఈ షూటింగ్‌లో ఐదుగురు యువకులు, ఓ ఏడేళ్ల బాలుడు పాల్గొన్నాడు. నీటిలో కొన్ని నిమిషాలపాటు ఊపిరి బిగపట్టి వారు నటించారు. నీటి అడుగు భాగాన డైలాగ్స్‌ కూడా పలుకాల్సి ఉంటుంది. షూటింగ్ చాలా కష్టం కావడంతో సైగలను కెమెరాతో క్యాప్చర్ చేశాం అని జేమ్స్ పేర్కొన్నారు.

    అవతార్‌లో పాండారో తెగ

    అవతార్‌లో పాండారో తెగ

    పాండారో గ్రహం, మానవుల వల్ల నావి తెగ ఎదుర్కొన్న ఇబ్బందులు కామెరూన్‌ అవతార్‌ చిత్రంలో చూపించారు. తాజా సీక్వెల్స్‌లో సినిమాల్లో సముద్రపు ఒడ్డున జీవిస్తున్న ఓ తెగ, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.

    అవతార్‌ సీక్వెల్స్‌లో కేట్ విన్స్‌లెట్

    అవతార్‌ సీక్వెల్స్‌లో కేట్ విన్స్‌లెట్

    అవతార్ సీక్సెల్స్‌లో టైటానిక్ చిత్రంలో నటించిన కేట్ విన్స్‌లెట్ నటిస్తున్నది. కేట్‌ విన్స్‌లెట్‌ కూడా ప్రత్యేక శిక్షణ తీసుకొంటున్నట్టు సమాచారం. సముద్ర తీరాల్లో జీవించే తెగకు చెందిన వ్యక్తిగా కేట్‌విన్సెలెట్‌ నటిస్తున్నది. నీటి అడుగు భాగాన ఎలా ఉండాలి.. ఎలా ఈత కొట్టాలి.. ఎలా నటించాలి అంశాలపై కేట్‌కు కోచింగ్ ఇస్తున్నాం. ఇప్పటికే కొందరు నటీనటులుకు ఆరు నెలలు శిక్షణ అందించాం అని జేమ్స్ కామెరూన్‌ అన్నారు.

     పైలెట్ ప్రాజెక్ట్ షూట్

    పైలెట్ ప్రాజెక్ట్ షూట్

    హాలీవుడ్‌లో ఇలాంటి తరహా చిత్రీకరణ జరుగలేదు. మేము ఇప్పుడు చేస్తున్నాం. నీటి అడుగు భాగాన షూటింగ్ చేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలుసుకోవడానికి పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ప్రస్తుతం చిన్నగా ఉంటే నీటి ట్యాంకులోనే షూట్‌ చేస్తున్నాం. జనవరి నుంచి భారీ ట్యాంకుల్లో షూటింగ్‌ను కొనసాగిస్తాం అని జేమ్స్ కామెరాన్ వెల్లడించారు.

     కలెక్షన్ల వర్షం..

    కలెక్షన్ల వర్షం..

    2009-10లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అవతార్‌ చిత్రం కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రానికి 2.78 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఒక చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా? అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రం అందించిన స్ఫూర్తి, ఈ చిత్రానికి కొనసాగింపుగానే అవతార్‌ 2, అవతార్‌ 3 చిత్రాలు రూపుదిద్దుకొంటున్నాయి. అవి విజయవంతమైతేనే 4, 5 రూపొందిస్తానని జేమ్స్ వెల్లడించారు.

     అవతార్ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్

    అవతార్ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్

    శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న అవతార్2 డిసెంబర్ 18, 2020న, అవతార్ 3 చిత్రం డిసెంబర్‌ 17, 2021న విడుదల కానున్నది. ఇదిలా ఉండగా అవతార్‌ 4, అవతార్‌ 5 చిత్రాల విడుదల తేదీలను కూడా కెమెరూన్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 20, 2024న అవతార్ 4, డిసెంబర్‌ 19, 2025న అవతార్ 5 చిత్రాలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

    English summary
    After Avatar success, Cameron is approaching these sequels. Avatar 2 and 3 are filming simultaneously, then Cameron will take a break from production to finish post-production on those two sequels, then go back in and shoot Avatar 4 and 5 simultaneously to wrap things up. This not only allows Cameron time to finish post-production in an orderly fashion, but also sounds like an organic break if 2 and 3 are a lot of water work.The filmmaker James cameron reveals that most underwater-heavy entries in The Avatar Sequels will be the second and third installments. He said, Avatar 2 hits theaters on December 18, 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X