ఎన్టీఆర్‌ను కాలితో తన్నిన జమున.. భగ్గుమన్న ఫ్యాన్స్.. చివరికి ఏమైందంటే?
తెలుగు ప్రేక్షకుల్లో సత్యభామగా చెరగను ముద్ర వేసుకున్నారు అలనాటి తార, సీనియర్ నటి జమున. మొదటి తరం హీరోయన్లలో హవా చాటిన ఆమె శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం వంటి భాషల్లో సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించిన జమున గడుసు పాత్రలకు పెట్టింది పేరు. ఇక మిస్సమ్మ సినిమాలో ఆమె అమాయకత్వం, అల్లరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానించే జమునపై సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకసారి ఫైర్ అయ్యారట. ఆ విషయంలోకి వెళితే..

వయోధిక కారణాలతో..
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే నటిమణులలో జమున ఒకరు. అలాంటి మహా నటి ఇవాళ అంటే శుక్రవారం (జనవరి 27) కన్నుమూశారు. జమున హఠాత్తుగా మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వయోధిక అనారోగ్య కారణాల వలన గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న జమున నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. 1936 ఆగస్టు 30వ తేదీన జన్మించిన జమునకు 86 సంవత్సరాలు.

పుట్టినిల్లు సినిమాతో..
ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్న జమున 1953లో పుట్టినిల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు సినీ రంగంలో ఆకట్టుకొన్న జమున నిరుపేదలు, వద్దంటే డబ్బు.
దొంగ రాముడు, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, సతి అనసూయ, ఇల్లరికం, అప్పు చేసి పప్పుకూడు, మూగ మనుషులు, రాముడు భీముడు, దొరికితే దొంగలు లాంటి మరుపురాని చిత్రాల్లో తనదైన హావభావాలు, నటనతో అలరించారు.

అగ్ర హీరోల సరసన..
ఎన్నో అవార్డులు, రివార్డులు, అగ్ర హీరోలతో నటించిన జమునపై ఒక సమయంలో సీనియర్ నందమూరి తారక రామారావు అభిమానులు భగ్గుమన్నారట. ఒకసారి ఎన్టీఆర్ ను జమున కాలితో తన్నడంపై ఎంతో ఫైర్ అయ్యారట.
అయితే అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్యతో పాటు సీనియర్ ఎన్టీఆర్ వంటి తదితర అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు జమున. జమున అనేక పాత్రల్లో చేసినప్పటికీ ఆమెకు సత్యభామ పాత్ర చాలా పేరు తీసుకొచ్చింది.

శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో..
సత్యభామ పాత్రలో జమునను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేం అన్నంతగా ఒదిగిపోయారు జమున. ఆమె సత్యభామగా నటించిన మొదటి చిత్రం వినాయక చవితి. ఇందులో ఆమె నటన బాగుండటంతో మరో సినిమాలో కూడా అదే పాత్ర కోసం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా జమున సత్యభామ పాత్ర చేశారు. ఈ సినిమాతోనే సత్యభామ అంటే జమున అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

పాత్ర కోసమే చేసినట్లు..
ఇక శ్రీకృష్ణ తులాబారంలో సత్యభామగా నటిస్తే శ్రీ కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ చేశారు. ఈ సినిమాలో ఓ పాట సన్నివేశంలో భాగంగా కృష్ణుడిని కాలితో తన్నే సీన్ లో నటించారు జమున. ఈ సీన్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమైంది. అయితే పాత్ర కోసమే అలా చేసినట్లు జమున వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. ఆ తన్నే సన్నివేశం చేసినప్పుడే జమునకు తప్పు చేసిన భావన కలిగిందట.

అలా చేసేసరికి మనసు పాడైంది..
ఒకసారి అలీతో సరదాగా టాక్ షోకి హాజరైన జమున సీనియర్ ఎన్టీఆర్ ను కాలితో తన్నిన విషయం గురించి చెప్పుకొచ్చారు. "నేను కృష్ణుడికి పెద్ద భక్తురాలిని. అందుకే సినిమాలో సత్యభామగా అలిగినప్పుడు, కాలితో ఆయన తలపై (కిరీటం) తన్నిన తర్వాత మనసంతా పాడైపోయింది. సీన్ అయ్యాక నేను ఆయనతో సారీ సార్ అని చెబితే.. ఇట్స్ ఆల్ రైట్. ఆల్ దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అని నవ్వేశారు" అంటూ చెప్పిన జమున ఆయన తరహాలోనే ఇమిటేట్ చేసి తెలిపారు.


Click it and Unblock the Notifications











