జమున ఆ మాట అనగానే.. చేత్తో ఆమె నోటిని మూసేసిన బాలయ్య!
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నందమూరి తారకరామారావు గారితో కలసి సీనియర్ నటి జమున ఎన్నో సూపర్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో క్లాసిక్ అనదగ్గ చిత్రాలు ఎన్నో వచ్చాయి.
జమున కూడా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ కు అతిథిగా హాజరయ్యారు. జమున మాట్లాడుతూ.. బిడ్డలు తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడే కాదు తండ్రిని మించిన అని అంటుండగానే బాలయ్య ఆమె నోటిని చేత్తో మూసేయడం విశేషం. బాలయ్య చేయి అడ్డు తీశాక.. ఆమె నవ్వుతూ తండ్రిని మించిన తనయుడు ఎందుకు అన్నానంటే.. ఎన్టీఆర్ గారు పౌరాణికాలు, జానపదాలు ఇలా కొన్ని వందల చిత్రాలు చేశారు. అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రని మరోమారు మనకు చూపించడం పెద్ద సాహసం అని జమున అన్నారు.

వేదికపై బాలయ్య, జమున కలసి ఆల్ టైం క్లాసిక్ సాంగ్ నన్ను దోచుకుందువంటే అనే పాటని పాడారు. బాలయ్యని ఈ గెటప్స్ లో చూస్తుంటే ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంది అని జమున తెలిపింది. ఈ చిత్రం ప్రపంచస్థాయి విజయం సాధించాలి అని జమున అన్నారు.


Click it and Unblock the Notifications











